విధాత: కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ప్రజలను నమ్మించేందుకు బీఆర్‌ఎస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం బండి సంజయ్‌ను పరామర్శించేందుకు కరీంనగర్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు.
పేపర్ లీకేజీలపై హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 30లక్షల మందికి ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున భృతి ఇవ్వాలన్నారు. 30లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ప్రజా సునామిలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
బీజేపీ నేతలు జైళ్లకు వెళ్లడం కొత్త కాదని, పోరాడూతూనే ఉంటామన్నారు. బీజేపీ సత్యం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. నిలువరిస్తే ఆగే పార్టీ బీజేపీ కాదన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని చూసి తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న ఆత్మలు గోషిస్తున్నాయన్నారు.
Live from Karimnagar https://t.co/S7ALXTRqCm
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 7, 2023
తెలంగాణ రాష్ట్రంలో అహంకార పాలన కొనసాగుతోందన్నారు. పేపర్ లీకేజీల వ్యవహరంలో కేసీఆర్ కుటుంబమే ఉందని ఆరోపించారు. అన్ని మాఫియాలు వారివేనన్నారు. డైవర్స్ చేయడానికి బీజేపీ స్టేట్ చీఫ్ పై కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా కేసీ ఆర్ రాజ్యాగం నడుస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోందన్నారు. లిక్కర్, లీకేజీల మాఫియా వారిదేనని ఆరోపించారు.
కావాలనే కుట్ర పూరితంగా బండి సంజయ్‌ను అర్దరాత్రి అరెస్టు చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.