Konaseema : కోనసీమలో అరుదైన పులిమచ్చల చేప లభ్యం

కొనసీమలో అరుదైన పులిమచ్చల టేకు చేప లభ్యం. ఔషధ గుణాలతో పేరుగాంచిన ఈ చేప వేలంలో అధిక ధరకు అమ్ముడైంది.

Konaseema : కోనసీమలో అరుదైన పులిమచ్చల చేప లభ్యం

అమరావతి : కోనసీమలో అరుదైన పులిమచ్చల చేప దర్శనమిచ్చింది. అంతర్వేది సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో అరుదైన పులిమచ్చల చేప చిక్కింది. దీనినే టేకు చేప లేదా “కాచిడి చేప”అని కూడా అంటారు. 10-15 కిలోల బరువు ఉండే ఈ టేకు చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వేలంపాటలో ఓ వ్యక్తి మంచి ధరకు ఈ చేపను సొంతం చేసుకున్నాడు. మందుల తయారీ, ఆక్వేరియం పెంపకంలో.. దీనికి మంచి డిమాండ్ కొనసాగుతుంది. పులాస చేపల మాదిరిగానే వేలంలో తరుచు లక్షల్లో ధర పలుకుతుంది.

వైద్యుల సమాచారం ప్రకారం.. పులి మచ్చల టేకు చేప ప్రోటీన్ అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. తక్కువ కొవ్వు ఉండటంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడుతుంది. ఈ టేకు చేప ఈశాన్య భారతదేశంలోని బ్రహ్మపుత్రా నది పరిసర అసోం, అరుణాచలప్రదేశ్ తీర ప్రాంత సముద్రాల్లో అరుదుగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది రేప్ ఫిష్‌గా గుర్తించబడింది.