Heart attack: పార్టీ నేతల అశ్రునయనాల మధ్య BRS నేత నరేందర్ అంత్యక్రియలు.. పాడే మోసిన MLA
విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల కొత్త బస్ స్టేషన్ కూడలిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఏర్పాటుచేసిన కళా ప్రదర్శనలో, కళాకారులతో కలిసి నృత్యం చేస్తూ ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందిన బండారి నరేందర్ అంత్యక్రియలు శనివారం రాత్రి ముగిశాయి. నరేందర్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ రైతు విభాగం పట్టణ అధ్యక్షుడు. నరేందర్ సతీమణి బండారి రజనీ ప్రస్తుతం కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. నరేందర్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో […]

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల కొత్త బస్ స్టేషన్ కూడలిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద
పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఏర్పాటుచేసిన కళా ప్రదర్శనలో, కళాకారులతో కలిసి నృత్యం చేస్తూ ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందిన బండారి నరేందర్ అంత్యక్రియలు శనివారం రాత్రి ముగిశాయి.
నరేందర్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ రైతు విభాగం పట్టణ అధ్యక్షుడు. నరేందర్ సతీమణి బండారి రజనీ ప్రస్తుతం కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. నరేందర్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని గుండెపోటుతో మరణించగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ దావా వసంత-సురేష్ అంతిమ యాత్ర వెంట నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడే మోశారు. ఎమ్మెల్యే వెంట పట్టణ పార్టీ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నరేందర్ కు కన్నీటి వీడ్కోలు పలికారు.