BRS MLA | CM KCR సెల్ఫ్ గోల్‌.. ఎమ్మెల్యేల అవినీతిపై చర్యలేవంటూ విపక్షాల సెటైర్లు

BRS MLA విధాత: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ప్లీనరీ సభలో దళిత బంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు మూడు లక్షల దాకా లంచం తీసుకున్నారని సదరు ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన వద్ద ఉందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా మారి కేసిఆర్ కే భూమ్ రాంగ్ అవుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తప్పు చేస్తే నా బిడ్డ అయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు […]

BRS MLA | CM KCR సెల్ఫ్ గోల్‌.. ఎమ్మెల్యేల అవినీతిపై చర్యలేవంటూ విపక్షాల సెటైర్లు

BRS MLA

విధాత: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ప్లీనరీ సభలో దళిత బంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు మూడు లక్షల దాకా లంచం తీసుకున్నారని సదరు ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన వద్ద ఉందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా మారి కేసిఆర్ కే భూమ్ రాంగ్ అవుతున్నాయి.

కేసీఆర్ వ్యాఖ్యలపై వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తప్పు చేస్తే నా బిడ్డ అయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేలు అవినీతి చేశారని చెప్పి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళిత బంధులో మూడు లక్షల లంచం తీసుకున్న ఎమ్మెల్యేలను ఎందుకు పార్టీ నుండి బహిష్కరించడం లేదంటూ నిలదీశారు.

ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనక ముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుండి సస్పెండ్ చేశారని, మరి ఆ నామకుడికి ఉన్న విలువ మీకు లేదా అంటూ షర్మిల ప్రశ్నించారు. లేదా ఎమ్మెల్యేల‌ పై చర్యలు తీసుకుంటే లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే వెనుకాడుతున్నారా అని షర్మిల ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కళ్ళు తుడుచుకొని చూస్తున్నారని, బంగారు బతుకమ్మనే బాగా లేనప్పుడు ఇతరులను శిక్షించే అర్హత కేసిఆర్ కు ఎక్కడుంది అంటూ సెటైర్ వేశారు. అసలు కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని పాలించే స్థాయి ఎక్కడిదని, అవినీతి పాలనలో మునిగితేలిన కెసిఆర్ కు, ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని, అధికారాన్ని దూరం చేస్తారని హెచ్చరించారు.

ఇక బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ సర్కార్ 30% కమీషన్‌ సర్కార్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. టీజేఎస్ పార్టీ నేతలు కూడా కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేశారని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నందున వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ తాను ఆధారాలతో మంత్రి నిరంజన్ రెడ్డి పై చేసిన ఆరోపణల పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విచారకరమన్నారు. దారిన పోయే దానయ్య ఆరోపిస్తే సమాధానం చెబుతావా అంటూ మంత్రి నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. దారిన పోయే దానయ్య ఉత్తరం రాశారని గతంలో బీసీ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తొలగించారని, ఆరోపణలు చెప్పకుండానే డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుండి తొలగించారని గుర్తు చేశారు.

తప్పు చేస్తే కొడుకైన, కూతురైన జైలుకు వెళ్లాల్సిందేనన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి పైన, దళిత బంధులో అవినీతి చేశారని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన ఎమ్మెల్యేలపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ నిలదీశారు.

ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో చేసినట్లుగానే దళిత బంధులో అవినీతి చేసిన ఎమ్మెల్యేలపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సీల్డ్ కవర్ లెటర్లు పంపిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. లేక సిట్ వేసి దర్యాప్తు చేపిస్తారా అంటూ సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు సెటైర్ వేశారు.

ACB, ED, DGPలకు BJP లేఖ.. దళిత బంధు అవినీతిపై విచారణ చేయాలని విజ్ఞప్తి.. ఒక్కో లబ్ధిదారుడి దగ్గర ఎమ్మెల్యేలే మూడు లక్షలు వసూలు చేశారు.. BRS ఆవిర్భావ ప్లీనరీ సభలో ఇదే విషయాన్ని సీఎం కేసిఆర్ ప్రస్తావించారు.. అన్ని దినపత్రికల్లో ఇదే వార్త ప్రధానంగా నిలిచింది. దళితబంధు అవకతవకలపై సీఎం కూడా అంగీకరించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని BJP డిమాండ్ చేసింది.