BRS | తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు MLC పదవి? హైదరాబాద్‌కు పిలుపు
BRS విధాత: తెలంగాణ మలిదశ పోరాటం తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. రేపు హైదరాబాదులో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్న అమరవీరుల స్మృతి వనం కార్యక్రమంలో పాల్గొనాలని శంకరమ్మకు బుధవారం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా పిలుపు వచ్చింది. దీంతో ఆమె హైదరాబాద్‌కి వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసినట్లుగా ప్రచారం సాగుతుంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ […]

BRS
విధాత: తెలంగాణ మలిదశ పోరాటం తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. రేపు హైదరాబాదులో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్న అమరవీరుల స్మృతి వనం కార్యక్రమంలో పాల్గొనాలని శంకరమ్మకు బుధవారం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా పిలుపు వచ్చింది.
దీంతో ఆమె హైదరాబాద్‌కి వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసినట్లుగా ప్రచారం సాగుతుంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి శంకరమ్మ కు ఇవ్వాలని కేసీఆర్ భావించారని అందుకే ఆమెను హైదరాబాద్ కు పిలిపించారని గులాబీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి.
శంకరమ్మ కు గన్ మెన్, పిఏ, ప్రభుత్వ వాహనాన్ని కూడా కేటాయించినట్లుగా గురువారం నుండి ఆ సదుపాయాలన్నీ శంకరమ్మకు అందుబాటులో వస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం జిల్లా బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.