బీఆర్ఎస్‌ను వీడిన ఇద్దరు జడ్పీటీసీలు

లోకసభ ఎన్నికలవేళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

  • By: Somu |    latest |    Published on : Apr 15, 2024 3:21 PM IST
బీఆర్ఎస్‌ను వీడిన ఇద్దరు జడ్పీటీసీలు

ఇద్దరు సింగిల్ విండో చైర్మన్లు
పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు

విధాత బ్యూరో, కరీంనగర్: లోకసభ ఎన్నికలవేళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు సోమవారం రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పెద్దపల్లి, జూలపల్లి జడ్పీటిసి సభ్యులు బండారి రామ్మూర్తి, బొద్దుల లణ్, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులు మాదిరెడ్డి నరసింహారెడ్డి, చదువు రామచంద్రారెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం పెద్దపల్లి మండలం బంధంపల్లి
గ్రామం లోని స్వరూప గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతలకు కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.