BRSV: యూనివర్సిటీకి వస్తే రేవంత్‌రెడ్డిని అడ్డకుంటం: గెల్లు శ్రీనివాస్‌

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ విధాత: ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్‌రెడ్డి వస్తే తరిమి కొడతామని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు ఓయూ క్యాంపస్‌లోని ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ పై ప్రభుత్వం మీద రేవంత్‌రెడ్డి నిరాదారోపణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని, అందుకే సిట్ విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో […]

BRSV: యూనివర్సిటీకి వస్తే రేవంత్‌రెడ్డిని అడ్డకుంటం: గెల్లు శ్రీనివాస్‌
  • బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌

విధాత: ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్‌రెడ్డి వస్తే తరిమి కొడతామని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు ఓయూ క్యాంపస్‌లోని ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ పై ప్రభుత్వం మీద రేవంత్‌రెడ్డి నిరాదారోపణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు.

పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని, అందుకే సిట్ విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగ వ్యతిరేక నాయకులని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు.

సమావేశంలో మందల భాస్కర్, వీరబాబు, తొట్ల స్వామి, తుంగ బాలు, కడారి స్వామి, కిరణ్ గౌడ్, రఘురాం, హరిబాబు, శిగా వెంకట్, చటారి దశరథ్, నవీన్ గౌడ్, కృష్ణ, రమేష్ గౌడ్, నాగేందర్ రావు, అవినాష్‌, వివిధ సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.