Mancherial | రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
విధాత, అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల (Mancherial) జిల్లా క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీ కాంతారావు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు గతంలో మద్యం వ్యాపారం చేసేవాడు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. లక్ష్మీ కాంతారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి పారిపోయారు. భూ తగాదాల మూలంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు […]

విధాత, అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల (Mancherial) జిల్లా క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీ కాంతారావు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు గతంలో మద్యం వ్యాపారం చేసేవాడు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
లక్ష్మీ కాంతారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి పారిపోయారు. భూ తగాదాల మూలంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రామకృష్ణాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.