బన్నీ బాబు.. ఆ.. యాటిట్యూడ్‌ తగ్గించుకుంటే మంచిది!

కొత్త దేవుడండి.. మన బన్నీ బాబు సరికొత్త దేవుడండి! విధాత: సినిమా వాళ్లందరికీ ఎక్కువగా ఈగో ఉంటుంది.. మరీ ఎక్కువగా యాటిట్యూడ్ చూపిస్తారనేది సరి కాదు. అందరినీ ఒక ఘాటిన కట్టలేం. ఎవరో ఒకరు అలా చేశారని ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా అలా అనేయడం సమంజసం కూడా కాదు. ఎందుకంటే ఒకపక్క సూపర్ స్టార్లుగా ఎదిగిన అమితాబచ్చన్, రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, చిరంజీవి వంటి ఎందరో డౌన్ టు ఎర్త్ లా బిహేవ్ చేస్తూ ఉంటారు. […]

  • By: krs    latest    Dec 21, 2022 11:19 AM IST
బన్నీ బాబు.. ఆ.. యాటిట్యూడ్‌ తగ్గించుకుంటే మంచిది!

కొత్త దేవుడండి.. మన బన్నీ బాబు సరికొత్త దేవుడండి!

విధాత: సినిమా వాళ్లందరికీ ఎక్కువగా ఈగో ఉంటుంది.. మరీ ఎక్కువగా యాటిట్యూడ్ చూపిస్తారనేది సరి కాదు. అందరినీ ఒక ఘాటిన కట్టలేం. ఎవరో ఒకరు అలా చేశారని ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా అలా అనేయడం సమంజసం కూడా కాదు. ఎందుకంటే ఒకపక్క సూపర్ స్టార్లుగా ఎదిగిన అమితాబచ్చన్, రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, చిరంజీవి వంటి ఎందరో డౌన్ టు ఎర్త్ లా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కుర్ర కుంకలు మాత్రం డెమీ గాడ్స్‌గా ఫీల్ అవుతూ ఉంటారు.

ముఖ్యంగా అల్లు వారి కాంపౌండులోని హీరోల‌ బిహేవియర్ మరీ ఓవర్. నాలుగైదు హిట్స్ రాగానే అల్లు అర్జున్.. ఒకటి రెండు హిట్స్ రాకుండానే అల్లు శిరీష్.. ఇక అల్లు బాబి వీరికి తోడు వీరి స్నేహితుడైన నవదీప్, కొత్తగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి సూపర్ స్టార్‌కి ఒక పీక్ పీరియడ్ ఉంటుంది. తమదైన రోజు వస్తుంది. అప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ మేనియానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పీరియడ్ అల్లు అర్జున్‌ని వరించింది. అలాంటి పీరియడ్‌ను ప్రస్తుతం బన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు.