SLBC టన్నెల్‌కు.. కడవర్ డాగ్స్!

  • By: sr    latest    Mar 06, 2025 5:22 PM IST
SLBC టన్నెల్‌కు.. కడవర్ డాగ్స్!

విధాత, వెబ్ డెస్క్: SLBC టన్నెల్‌ (SLBC Tunnel)లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ నుంచి కడవర్ డాగ్స్  (Cadre dogs)ను రప్పించారు. ఆర్మీ హెలిక్యాప్టర్ లో తీసుకొచ్చిన రెండు కడవర్ డాగ్స్ లను సొరంగంలో గల్లంతైన 8మంది సిబ్బంది ఆచూకీని గుర్తించేందుకు సొరంగం లోపలికి తీసుకెళ్లారు. కడవర్ డాగ్స్ పోలీసుల, సైనికుల విధులలో భాగంగా ఉపయోగిస్తారు. క్యాడర్ డాగ్స్‌ను K9 డాగ్స్ అని కూడా అంటారు.

ఐఐటీ నిపుణుల బృందంతో పాటు సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా టన్నెల్ లోకి వెళ్లాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ టన్నెల్ లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. టన్నెల్ లోపల పని చేసేవారికి కావాల్సిన సదుపాయాల ఏర్పాటు చేస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ కీలకంగా మారిన కన్వెర్టర్ బెల్ట్ మరమ్మతులు పూర్తవ్వడంతో తిరిగి పనిచేయిస్తున్నారు. 13.5కిలోమీటర్ల వరకు దీనిని పునరుద్ధరించారు. కన్వెర్టర్ బెల్ట్ సహాయంతో గంటకు 800టన్నుల బురద, మట్టిని బయటకు పంపిస్తున్నారు.