వరదలో కొట్టుకుపోయిన స్కార్పియో.. వీడియో
విధాత : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సుభాన్‌సిరి జిల్లాలో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో.. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి ఓ స్కార్పియో కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు లోయలో పడిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో ఆ కారు చుట్టూ ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ, దాన్ని ఆపలేకపోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.