Bihar | బీహార్‌లో కులగణన పూర్తి
Bihar | విధాత, పట్నా: బిహారులో క్షేత్రస్థాయిలో కులగణన కార్యక్రమం పూర్తి కావచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని డిజిటలైజు చేసే ప్రక్రియ జిల్లాయంత్రాంగం ముమ్మరం చేసిందని కూడా ఆ వర్గాలు తెలిపాయి. బిహారు జాతి ఆధారిత్ గణన యాప్‌లో ఈ సమాచారాన్ని సేకరించింది. కులంతో సహా 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్‌లో నింపే కార్యక్రమం పూర్తయినట్టు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఈ సమాచారాన్ని అంతా బిహారు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ డిజిటలైజ్ […]

Bihar |
విధాత, పట్నా: బిహారులో క్షేత్రస్థాయిలో కులగణన కార్యక్రమం పూర్తి కావచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని డిజిటలైజు చేసే ప్రక్రియ జిల్లాయంత్రాంగం ముమ్మరం చేసిందని కూడా ఆ వర్గాలు తెలిపాయి. బిహారు జాతి ఆధారిత్ గణన యాప్‌లో ఈ సమాచారాన్ని సేకరించింది.
కులంతో సహా 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్‌లో నింపే కార్యక్రమం పూర్తయినట్టు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఈ సమాచారాన్ని అంతా బిహారు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ డిజిటలైజ్ చేస్తున్నదని అధికారవర్గాలు తెలిపాయి.
కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన కేసులన్నింటినీ పట్నా హైకోర్టు ఆగస్టు 1వ తేదీన కొట్టి వేసిన విషయం విదితమే. కులగణను ఆపడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. పట్నా జిల్లాకు సంబంధించి 10 లక్షల 63 వేల కుటుంబాల సమాచారాన్ని డిజిటైజ్ చేశామని, మరో ముప్పై శాతం ఇంకా పూర్తి కావలసి వుందని జిల్లా కలెక్టరు చెప్పారు.