MP Avinash Reddy | వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
MP Avinash Reddy | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఈ నోటీసులను అవినాష్ రెడ్డికి అందజేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వివేకానంద హత్య కేసులో అవినాష్ […]
MP Avinash Reddy | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఈ నోటీసులను అవినాష్ రెడ్డికి అందజేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే నాలుగు సార్లు విచారించారు సీబీఐ అధికారులు. ఆదివారం ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో భాగంగా ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram