Aadhaar | ఆధార్‌ యూజర్లకు కేంద్రం శుభ‌వార్త‌.. ఎలాంటి ఫీజులు లేకుండానే ఆ సేవలు..!

Aadhaar | ఆధార్‌ యూజర్లకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆధార్ తీసుకొని పదేళ్లు దాటితే ఆధార్ అప్‌గ్రేడ్‌ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. అప్‌గ్రేడేషన్‌ కోసం రూ.25 ఫీజుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వసూలు చేస్తోంది. తాజాగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే వారికి యూఐడీఏఐ వెసులుబాటు కల్పించింది. ఆధార్ సవరణల కోసం ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదని నిర్ణయించింది. అయితే, ఈ అవకాశం కేవలం మూడు నెలలు మాత్రమేనని స్పష్టం చేసింది. యూఐడీఏఐ […]

Aadhaar | ఆధార్‌ యూజర్లకు కేంద్రం శుభ‌వార్త‌.. ఎలాంటి ఫీజులు లేకుండానే ఆ సేవలు..!

Aadhaar | ఆధార్‌ యూజర్లకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆధార్ తీసుకొని పదేళ్లు దాటితే ఆధార్ అప్‌గ్రేడ్‌ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. అప్‌గ్రేడేషన్‌ కోసం రూ.25 ఫీజుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వసూలు చేస్తోంది. తాజాగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే వారికి యూఐడీఏఐ వెసులుబాటు కల్పించింది.

ఆధార్ సవరణల కోసం ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదని నిర్ణయించింది. అయితే, ఈ అవకాశం కేవలం మూడు నెలలు మాత్రమేనని స్పష్టం చేసింది. యూఐడీఏఐ ప్రకారం.. మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఆధార్ అప్‌గ్రేడేషన్‌ ఉచితంగా చేసుకోవచ్చు.

అవసరమైన గుర్తింపు పత్రాలతో ఆధార్ పోర్టల్ ద్వారా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఉచిత సేవలు ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండనుండగా.. పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర సేవలకు మాత్రం తప్పనిసరిగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత సదుపాయం కేవలం ఆధార్ అప్‌గ్రేడేషన్‌కు మాత్రమేనని అధికారులు పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో లక్షలాది ప్రజలు లబ్ధి పొందుతారని, అప్‌గ్రేడేషన్‌ గడువు ముగిశాక రూ.50 చెల్లించాలి ఉంటుందని పేర్కొంది. ఆధార్ కార్డును ప్రతి పదేళ్ల కోసం తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.