Virat Kohli| సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సింహాద్రి అప్పన్న స్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Virat Kohli| సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ

అమరావతి: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli) సింహాద్రి అప్పన్న స్వామి( Simhachalam Temple) దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో కోహ్లీ స్వామివారిని దర్శించుకున్నారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. స్వామివారి దర్శనానంతరం కోహ్లీకి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలిచ్చారు. దేవస్థానం అధికారులు కోహ్లీకి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ సైతం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతో పాటు సిరీస్ ను గెలుచుకోవడంలో కోహ్లీ కీలక భూమిక పోషించారు. మొదటి రెండు వన్డేలలో వరుస సెంచరీలు సాధించిన కోహ్లీ..విశాఖలో జరిగిన మూడో వన్డేలోనూ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.