Chicken Price | కొండెక్కిన కోడి ధ‌ర‌లు.. కిలో రూ. 310 పైనే

Chicken Price విధాత‌: హైద‌రాబాద్ న‌గ‌రంలో కోడి ధ‌ర‌లు కొండెక్కాయి. సామాన్యుడు కొన‌లేని ప‌రిస్థితిలో చికెన్ ధ‌ర‌లు ఆకాశ‌న్నంటాయి. చికెన్ ధ‌ర‌లు మాంసంతో పోటీ ప‌డుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కిలో చికెన్ ధ‌ర‌లు రూ. 280 వ‌ర‌కు ఉండే. కానీ ఉన్న‌ట్టుండి ఏకంగా కిలో చికెన్‌పై రూ. 30 నుంచి రూ. 40 దాకా పెరిగింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో చికెన్(స్కిన్‌లెస్‌) ధ‌ర రూ. 310 ప‌లుకుతుంది. స్కిన్‌తో కూడిన కిలో చికెన్ రూ. […]

Chicken Price | కొండెక్కిన కోడి ధ‌ర‌లు.. కిలో రూ. 310 పైనే

Chicken Price

విధాత‌: హైద‌రాబాద్ న‌గ‌రంలో కోడి ధ‌ర‌లు కొండెక్కాయి. సామాన్యుడు కొన‌లేని ప‌రిస్థితిలో చికెన్ ధ‌ర‌లు ఆకాశ‌న్నంటాయి. చికెన్ ధ‌ర‌లు మాంసంతో పోటీ ప‌డుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కిలో చికెన్ ధ‌ర‌లు రూ. 280 వ‌ర‌కు ఉండే. కానీ ఉన్న‌ట్టుండి ఏకంగా కిలో చికెన్‌పై రూ. 30 నుంచి రూ. 40 దాకా పెరిగింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో చికెన్(స్కిన్‌లెస్‌) ధ‌ర రూ. 310 ప‌లుకుతుంది. స్కిన్‌తో కూడిన కిలో చికెన్ రూ. 280గా ధ‌ర ప‌లుకుతుంది.

గత వారం రోజుల్లో కిలో చికెన్ ధరలు రూ.50 నుంచి రూ. 60 వరకు పెరిగినట్లు చికెన్ విక్రయదారులు పేర్కొంటున్నారు. చికెన్ కోసం దుకాణాల వద్దకు వెళ్లి పేద, మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో చికెన్ కొనుగోలు చేయలేమని వెనుదిరిగిపోతున్న పరిస్థితి నెల‌కొంది.

రికార్డు స్ధాయిలో చికెన్ ధరలు పెరుగుతుండడంతో గిరాకీ తగ్గి వ్యాపారస్తులు సైతం డీలా పడుతున్నారు. ఇక చికెన్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి ఎండాకాలంలో కోళ్ల ఉత్ప‌త్తి త‌క్కువ‌గా ఉండ‌టం ఒక కార‌ణ‌మైతే.. కోళ్ల దాణా రేటు పెర‌గ‌డం కూడా మ‌రో కార‌ణ‌మ‌ని వ్యాపారులు పేర్కొంటున్నారు.