Chief Whip Dasyam | నిరుపేద గుడిసెవాసులకు పట్టాలు పంపిణీ
Chief Whip Dasyam పేదలను పట్టించుకోని గత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిరుపేదలకు గూడు నీడ కల్పించాలనే లక్ష్యంగా జీవో నెం 58ను ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అంబేద్కర్ నగర్, సాయి నగర్, శ్రీనివాస కాలనీలలో ఇళ్ల పట్టాలను గురువారం పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Chief Whip Dasyam
- పేదలను పట్టించుకోని గత ప్రభుత్వాలు
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిరుపేదలకు గూడు నీడ కల్పించాలనే లక్ష్యంగా జీవో నెం 58ను ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
అంబేద్కర్ నగర్, సాయి నగర్, శ్రీనివాస కాలనీలలో ఇళ్ల పట్టాలను గురువారం పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిసెవాసుల నలభై యేళ్ళ నిరీక్షణను తీర్చామన్నారు. 75 సంవత్సరాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలించినా నిరుపేదలను పట్టించుకోలేదని విమర్శించారు.

నిరుపేదలకు భద్రతా, భరోసాను కల్పిస్తూ ఇప్పటికే పోచమ్మకుంటలో పట్టాల పంపిణీ ఒక పండగ వాతావరణం సంతరించుకుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు కల్పించాలనే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు నిరుపేదలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలేక పోయాయన్నారు.
అర్హులైన పేదలు 58 జీవో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అధికారులతో సమన్వయం చేసుకొని హక్కు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. 54 మందికి గురువారం ఇండ్ల పట్టాలు పంపిణీ చేసామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చందర్, ఎమ్మార్వో రాజ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు పొడిశెట్టి అనిల్, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram