తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. ఆసుప్రతికి తీసుకెళ్లితే ఆడబిడ్డకు జన్మనిచ్చింది..!

Viral News | ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి ఒక్కసారిగా కడుపునొప్పితో బాధపడింది. దీంతో ప్రైవేటు ఆసుప్రతికి తీసుకెళ్లి అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. దీంతో పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థిని సోదరుడు, కుటుంబీకుల అంగీకారంతో ప్రసవం చేయగా.. విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సదరన్‌ ఎన్పీ సింగ్‌ పాఠశాల, ఆసుపత్రికి […]

తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. ఆసుప్రతికి తీసుకెళ్లితే ఆడబిడ్డకు జన్మనిచ్చింది..!

Viral News | ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి ఒక్కసారిగా కడుపునొప్పితో బాధపడింది. దీంతో ప్రైవేటు ఆసుప్రతికి తీసుకెళ్లి అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. దీంతో పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థిని సోదరుడు, కుటుంబీకుల అంగీకారంతో ప్రసవం చేయగా.. విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సదరన్‌ ఎన్పీ సింగ్‌ పాఠశాల, ఆసుపత్రికి చేరుకొని విషయంపై ఆరా తీశారు.

ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మే నెలలో వేసవి సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి కడుపునొప్పి వస్తుందని చెబుతున్నది. కమ్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న ప్రముఖ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థి చదువుతున్నది. అయితే, విద్యార్థి ఓ బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. విద్యార్థి వయసు 14 సంవత్సరాలు కాగా.. ఈ నెల ఒకటి పాఠశాలలో ఉన్న సమయంలో కడుపునొప్పి ఉందని పాఠశాల యాజమ్యానానికి చెప్పింది. దీంతో ఈ నెల విద్యార్థి సోదరుడు వచ్చి హింద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అల్ట్రాసౌండ్‌లో విద్యార్థిని ఎనిమిదిన్నర నెలల గర్భవతి అని తేలింది. ఆ తర్వాత అర్ధరాత్రి సాధారణ ప్రసవం జరుగడంతో రాత్రి ఒంటిగంట సమయంలో ఆ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చిందని హింద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సీఎంఎస్ డాక్టర్ రవి సిన్హా పేర్కొన్నారు.

ఆ తర్వాత ఆమెను డిశ్చార్జి చేయగా సోదరుడు ఇంటికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బాలికకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గార్డియన్‌గా ఉన్న సోదరుడిని పిలిచి తనతో పాటు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు దక్షిణ ఏఎస్పీ ఎన్‌పీ సింగ్ తెలిపారు. అయితే, పాఠశాలలో విద్యార్థిని గర్భిణి అని గుర్తించలేకపోవడం గమనార్హం. మూడు నాలుగు నెలల తర్వాత లక్షణాలు కనిపిస్తాయని, డెలివరీ జరిగే వరకు కూడా విషయం బయటకు తెలియకపోవడం నమ్మశక్యంగా లేదని పాఠశాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై సోదరుడు ఏమీ స్పందించకపోవడం ప్రస్తావనార్హం.