Pregnant Woman | బ్రెయిన్ డెడ్‌కు గురైన 9 నెలల గర్భిణి.. పండంటి ఆడబిడ్డకు జన్మ
Pregnant Woman | బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ 9 నెలల గర్భిణి.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను జీవన్‌దాన్‌కు డోనేట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో వెలుగు చూసింది.

Pregnant Woman | హైదరాబాద్ : బ్రెయిన్‌డెడ్( Brain Dead )కు గురైన ఓ 9 నెలల గర్భిణి.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను జీవన్‌దాన్‌కు డోనేట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి( KIMS Hospital )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జూన్ 8వ తేదీన మద్దికట్ల సునీత(27) అనే 9 నెలల గర్భిణి( Pregnant Woman ) తన భర్తతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా, వారిని ఆటో ఢీకొట్టింది. దీంతో సునీతకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు చికిత్స అందించారు. ఆమె కోమాలో ఉండగానే పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. అయితే ఆమెను ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. కానీ సునీతలో ఎలాంటి కదలిక లేదు. మంగళవారం ఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఇక జీవన్‌దాన్ కోఆర్డినేటర్స్.. సునీత భర్త, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో సునీత అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. సునీతకు సంబంధించిన లివర్, రెండు కిడ్నీలను వేరే పేషెంట్లకు అమర్చారు. సునీత భర్తను డాక్టర్లు అభినందించారు.