Climate Change | ప్రపంచవ్యాప్తంగా జులైలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..! అప్పటి వరకు వేడి తప్పదని పరిశోధకుల హెచ్చరిక..!

Climate Change | భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో గ్లోబల్ వార్మింగ్‌తో పాటు వాతావరణ మార్పులు, ఎల్‌ నినో ప్రభావంతో తొలిసారిగా జులైలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. ఉత్తర అర్ధగోళంలోని అనేక ప్రాంతాలు ఏకకాలంలో హీట్‌వేవ్‌ను ఎదుర్కొన్నాయి. క్లైమేట్ సెంట్రల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచ జనాభాలో 80శాతం మంది అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈ గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ. క్లైమేట్ సెంట్రల్‌కు […]

Climate Change | ప్రపంచవ్యాప్తంగా జులైలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..! అప్పటి వరకు వేడి తప్పదని పరిశోధకుల హెచ్చరిక..!

Climate Change |

భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో గ్లోబల్ వార్మింగ్‌తో పాటు వాతావరణ మార్పులు, ఎల్‌ నినో ప్రభావంతో తొలిసారిగా జులైలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. ఉత్తర అర్ధగోళంలోని అనేక ప్రాంతాలు ఏకకాలంలో హీట్‌వేవ్‌ను ఎదుర్కొన్నాయి.

క్లైమేట్ సెంట్రల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచ జనాభాలో 80శాతం మంది అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈ గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ. క్లైమేట్ సెంట్రల్‌కు చెందిన క్లైమేట్ ఛేంజ్‌ ఇండెక్స్ (CSI) ప్రతిరోజూ ఉష్ణోగ్రతలను రికార్డు చేస్తూ.. వాటి ప్రభావాలను విశ్లేషిస్తుంది.

ఇందులో భాగంగా జులై ఒకటి నుంచి 31 వరకు 200 దేశాల్లోని 4,700 నగరాలను విశ్లేషించింది. జులైలో అన్ని ఖండాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. జులై 16న చైనాలో అత్యధిక ఉష్ణోగ్రత 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఈ భారీ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉత్తర అమెరికాలోని ఫీనిక్స్, అరిజోనాలో వరుసగా 31 రోజుల పాటు 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సైతం వేడిని ఎదుర్కొన్నాయి. పెరూ, ఉరుగ్వే వంటి అనేక దక్షిణ అమెరికా దేశాలు చలికాలంలోనూ వేడిగాలులు వీచాయి. కనీసం 2 బిలియన్ల మంది.. లేదంటే ప్రపంచ జనాభాలో 25 శాతం మంది, జులైలో ప్రతి రోజు మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు వాతావరణ మార్పులకు సంబంధించి ప్రభావాలను అనుభవించారని సీఎస్‌ఐ నివేదిక పేర్కొంది. జులై 10, 3వ తేదీల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదయ్యాయి.

చిన్న ద్వీపాలతో వాతావరణ మార్పులతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. కరేబియన్‌ ద్వీపాలు సైతం ఉన్నాయి. అయితే, ఎల్‌ నినో పరిస్థితులు మరింత బలపడనుండడంతో విపరీతమైన వేడి మరి కొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్థానిక ఉష్ణోగ్రతలు రాబోయే సంవత్సరాలు రికార్డులు బద్దలవడం ఖాయమని పేర్కొంటున్నారు. అయితే, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను సున్నాకు తగ్గించే వరకు ఈ ముప్పు కొనసాగుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.