CM Jagan | ఢిల్లీకి సీఎం జగన్.. అందుకేనా?
CM Jagan విధాత: ఆంధ్ర సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. రేపు బయల్దేరి సాయంత్రానికి ఢిల్లీ చేరుకొని ఐదో తేదీన అక్కడి పెద్దలు అమిత్ షా తో బాటు ప్రధాని నరేంద్రమోడీని సైతం కలుస్తారని అంటున్నారు. పోలవరానికి సంబంధించి నిధులు తెచ్చే విషయంతోబాటు విభజన చట్టంలోని మరికొన్ని అంశాలను క్లియర్ చేసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నా లోపల ఇంకేదో ఉందని అంటున్నారు. ఈ మధ్యనే పోలవరానికి సవరించిన ధరల ప్రకారం ఇంకో రూ. 12911 కోట్లు ఇవ్వడానికి […]
CM Jagan
విధాత: ఆంధ్ర సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. రేపు బయల్దేరి సాయంత్రానికి ఢిల్లీ చేరుకొని ఐదో తేదీన అక్కడి పెద్దలు అమిత్ షా తో బాటు ప్రధాని నరేంద్రమోడీని సైతం కలుస్తారని అంటున్నారు. పోలవరానికి సంబంధించి నిధులు తెచ్చే విషయంతోబాటు విభజన చట్టంలోని మరికొన్ని అంశాలను క్లియర్ చేసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నా లోపల ఇంకేదో ఉందని అంటున్నారు.
ఈ మధ్యనే పోలవరానికి సవరించిన ధరల ప్రకారం ఇంకో రూ. 12911 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఇప్పటికీ అంగీకారం తెలిపింది దీనిమీద కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ నిధుల సంగతి ఎలా ఉన్నా జగన్ వెళ్ళింది మాత్రం వేరే పని మీద అని అంటున్నారు.
సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు క్లియర్ చేసుకుని ప్రజా మద్దతు పొందేందుకు ప్రయత్నించడం, ఇంకా కొన్ని ప్రాజెక్టులు సాధించడం.. ఇంకా రాజధాని అంశం మీద కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల విషయమై కూడా సానుకూల తీర్పు వస్తే విశాఖను రాజధానిగా చేసే విషయంలో కాస్త క్లారిటీ వస్తుంది.
ఇంకా అది ఆయనకు ప్రజల్లో ఇమేజి పెరుగుతుంది. వీటన్నిటితోబాటు ఆంధ్రాలో జనసేన చంద్రబాబులు ఇంకా ఎన్నికలకోసం సిద్ధం కాకముందే ఎన్నికలకు వెళ్లి వారిని దెబ్బ కొట్టేందుకు కూడా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఈ డిసెంబర్.. లోపు ఎన్నికలకు, అంటే తెలంగాణాతోబాటు ఎన్నికలకు వెళ్లి టిడిపి జనసేనలకు పొత్తు కుదుర్చుకునే టైం కూడా ఇవ్వకుండా ఎటాక్ చేసేందుకు జగన్ సిద్ధం అయ్యారు అని అంటున్నారు.
ఈ విషయమై శాసన సభను రద్దు చేసి, ముందుగా ఎన్నికలకు వెళతాం .. మీరు సహకరించండి అని ఢిల్లీ పెద్దలకు చెప్పేందుకు.. ఒప్పించేందుకు కూడా ఈ ఢిల్లీ పర్యటనలో అవకాశం ఉంటుందని అంటున్నారు . . మరి జగన్ అంతరంగంలో ఏముందో చూడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram