కేసీఆర్ కిట్‌లో ఉన్న ప‌ర‌మార్థం అదే : సీఎం కేసీఆర్

KCR KIT | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కేసీఆర్ కిట్ ప‌థ‌కం గురించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అస‌లు కేసీఆర్ కిట్‌లో ఉన్న ప‌ర‌మార్థం గురించి తెలిపారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. కేసీఆర్ కిట్ అంటే నాలుగు వ‌స్తువులు ఇచ్చి పంపించ‌డం కాదు. కేసీఆర్ ఏ ప‌ని చేసినా ఒక చ‌ర్చ‌, పెద్ద మ‌థ‌నం ఉంటుంది. కేసీఆర్ కిట్‌లో ఉన్న ప‌ర‌మార్థం ఏంటి […]

కేసీఆర్ కిట్‌లో ఉన్న ప‌ర‌మార్థం అదే : సీఎం కేసీఆర్

KCR KIT | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కేసీఆర్ కిట్ ప‌థ‌కం గురించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అస‌లు కేసీఆర్ కిట్‌లో ఉన్న ప‌ర‌మార్థం గురించి తెలిపారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కేసీఆర్ కిట్ అంటే నాలుగు వ‌స్తువులు ఇచ్చి పంపించ‌డం కాదు. కేసీఆర్ ఏ ప‌ని చేసినా ఒక చ‌ర్చ‌, పెద్ద మ‌థ‌నం ఉంటుంది. కేసీఆర్ కిట్‌లో ఉన్న ప‌ర‌మార్థం ఏంటి అంటే.. పేదింటి ఆడ‌బిడ్డ‌లు గ‌ర్భం దాల్చిన త‌ర్వాత కూడా ప‌ని చేస్తారు. అలాంటి మ‌హిళ‌లు ప‌ని చేస్తే ఆమెతో పాటు శిశువుకు మంచిది కాదు. పెద్ద‌వారింట్లో మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చితే సీమంతాలు, ఇత‌ర పండుగ‌లు చేస్తారు. పేద‌వాళ్ల ఇంట్లోంచి వ‌చ్చే మాట‌.. ఈమె నీళ్లు పోసుకున్న‌ది.. కూర్చోబెట్టి తిన‌పెట్టాలే. పేద‌రికం, ద‌రిద్రం వ‌ల్ల ఆ మాట‌లు వ‌స్తుంటాయి. గ్రామాల్లో ఆ మాట‌లు చాలా సార్లు విన్నాను. గ‌ర్భిణులు ప‌ని చేయొద్దంటే ఏదైతే వేత‌నం కోల్పోతారో.. ఆ వేత‌నాన్ని ఇవ్వాల‌నేదే ఈ ప‌థ‌కం ఉద్దేశం. ఈ ప‌థకంపై చాలా మ‌థ‌నం చేశాం.

ప్ర‌స‌వానికి వెళ్లిన‌ మ‌హిళ‌కు కావాల్సిన స‌దుపాయాలను ఆస్ప‌త్రుల్లో క‌ల్పించాం. పోలియో టీకా వేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మ‌హిళ‌ల యొక్క ఆత్మ‌గౌర‌వాన్ని పెంచ‌డానికి ఈ ప‌థ‌కం తోడ్పాటునిస్తుంది. అమ్మ ఒడి వాహ‌నాల ద్వారా ఉచితంగా గ‌ర్భిణుల‌కు సేవ‌లు అందిస్తున్నాం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి ప‌థ‌కాలు తెలంగాణ‌లో త‌ప్ప ఎక్క‌డా అమ‌లు అవ‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాల‌నే ఉద్దేశంతోనే కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నాం. కొన్ని చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉంటాయి. వాట‌న్నింటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.