నేడు ప్రజాభవన్ లో తొలి ప్రజా దర్బార్
జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు తొలి ప్రజాదర్బార్ ను నిర్వహించనున్నారు

విధాత : జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు తొలి ప్రజాదర్బార్ ను నిర్వహించనున్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ ప్రసంగిస్తూ ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజా దర్బార్ కు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు తెలుపవచ్చని చెప్పారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలపై ఆర్జీలు ఇచ్చేందుకు శుక్రవారం ఉదయం నుంచి ప్రజా భవన్ వద్ద బారులు తీరి కనిపించారు.
ప్రజాభవన్ కి వచ్చిన ప్రజల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వినతులు స్వీకరించనున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు పంపిస్తారు . ప్రజా దర్బార్ కు ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో కిందిస్థాయిలో తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ప్రజాదర్బార్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.