Adilabad: బోథ్ BRSలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. MLA, MPP పోటా పోటీ ఆత్మీయ సమ్మేళనాలు

విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో అధికార బిఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బోథ్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ పోటా పోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆత్మీయ సమ్మేళనానికి పోటీగా, మరో ఆత్మీయ సమ్మేళనం నిర్వ‌హించ‌డానికి ఎంపీపీ తుల శ్రీనివాస్ బిఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాడు. ఎంపీపీ తుల శ్రీనివాస్ బుక్ చేసుకున్న […]

Adilabad: బోథ్ BRSలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. MLA, MPP పోటా పోటీ ఆత్మీయ సమ్మేళనాలు

విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో అధికార బిఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బోథ్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ పోటా పోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆత్మీయ సమ్మేళనానికి పోటీగా, మరో ఆత్మీయ సమ్మేళనం నిర్వ‌హించ‌డానికి ఎంపీపీ తుల శ్రీనివాస్ బిఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాడు.

ఎంపీపీ తుల శ్రీనివాస్ బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ తాళం వేసి ఉండడంతో వెంటనే యజమానికి ఫోన్ చేసి హెచ్చరించాడు. ఫంక్షన్ హాల్ యజమానికి పోలీసులు ఫోన్ చేసి వద్దని చెప్పడంతోనే గేటుకు తాళం వేశారని ఎంపీపీ అనుచరులు ఆందోళన చేశారు, ఎంపీపీ వర్గం కార్యకర్తలు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆత్మీయ సమ్మేళనానికి ఫంక్షన్ హాల్ తెరవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఎంపీపీ హెచ్చరించడంతో పోలీసులు ఫంక్షన్ హాల్ యజమానితో మాట్లాడి తాళాలు తీయించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఎంపీపీ ఆధ్వర్యంలోని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కొనసాగింది.