Twitter Vs Threads | ట్విట్టర్‌, థ్రెడ్స్‌ వార్‌.. మమ్మల్ని కాపీ కొట్టారు!

Twitter Vs Threads చట్టపర చర్యలు తప్పవని హెచ్చరిక మెటా సీఈవో జుకర్‌బర్గ్‌కు నోటీసు ట్విట్టర్‌కు పోటీగా విడుదలైన థ్రెడ్స్‌ కాలిఫోర్నియా: తాజాగా మెటా సంస్థ నుంచి విడుదలైన థ్రెడ్స్‌ సోషల్‌ మీడియా యాప్‌పై వివాదం రాజుకున్నది. తమను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను రూపొందించారని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ట్విట్టర్‌ సంస్థ నోటీసు పంపింది. ట్విట్టర్‌ ఉద్యోగులను నియమించుకుని, తమ మేధో సంపత్తి హక్కులను దొంగిలించి, కాపీక్యాట్‌ టెక్స్ట్‌ యాప్‌ను తయారు చేశారని ట్విట్టర్‌ లీగల్‌ […]

  • By: Somu    latest    Jul 07, 2023 10:11 AM IST
Twitter Vs Threads | ట్విట్టర్‌, థ్రెడ్స్‌ వార్‌.. మమ్మల్ని కాపీ కొట్టారు!

Twitter Vs Threads

  • చట్టపర చర్యలు తప్పవని హెచ్చరిక
  • మెటా సీఈవో జుకర్‌బర్గ్‌కు నోటీసు
  • ట్విట్టర్‌కు పోటీగా విడుదలైన థ్రెడ్స్‌

కాలిఫోర్నియా: తాజాగా మెటా సంస్థ నుంచి విడుదలైన థ్రెడ్స్‌ సోషల్‌ మీడియా యాప్‌పై వివాదం రాజుకున్నది. తమను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను రూపొందించారని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ట్విట్టర్‌ సంస్థ నోటీసు పంపింది.

ట్విట్టర్‌ ఉద్యోగులను నియమించుకుని, తమ మేధో సంపత్తి హక్కులను దొంగిలించి, కాపీక్యాట్‌ టెక్స్ట్‌ యాప్‌ను తయారు చేశారని ట్విట్టర్‌ లీగల్‌ ప్రతినిధి అలెక్సో స్పిరో ఆరోపించారు. తమ మేధో సంపత్తి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పిరో స్పష్టం చేశారు. లీగల్‌గా చర్యలు తీసుకోబోయే ముందు అవసరమైన పత్రాలను మెటా సంస్థ సిద్ధం చేసుకునేందుకు వీలుగా ఈ నోటీ పంపుతున్నట్టు అందులో తెలిపారు.

అయితే.. ట్విట్టర్‌ ఆరోపణలను మెటా ప్రతినిధి ఆండీ స్టోన్‌ కొట్టిపారేశారు. థ్రెడ్స్‌ యాప్‌ రూపకర్తల్లో ఒక్కరు కూడా ట్విట్టర్‌ మాజీ ఉద్యోగి లేరని స్పష్టం చేశారు. దీనిపై అమెరికాకు చెందిన ఒక ప్రముఖ వార్తా సంస్థ ట్విట్టర్‌ నుంచి స్పందన కోరగా.. అక్కడి నుంచి పూప్‌ ఎమోజీ మాత్రం వచ్చింది.

తాజా పరిణామాలపై మస్క్‌ కానీ, సంస్థ సీఈవో లిండా యక్కారినో కానీ ఇంత వరకూ స్పందించలేదు. గత ఏడాది 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను మస్క్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. లిండా మాత్రం చాలా మంది మమ్మల్ని అనుసరిస్తుంటారు. కానీ.. ట్విట్టర్‌ కమ్యూనిటీని డూప్లికేట్‌ చేయలేరు’ అని ట్వీట్‌ చేశారు.

మెటా బుధవారం లాంచ్‌ చేసిన థ్రెడ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఎంప్లాయీస్‌ రూపొందించారు. విడుదలైన 24 గంటల్లోనే కోట్ల సంఖ్యలో యూజర్లను ఆకర్షించింది. ఈ కంపెనీని మస్క్‌ చేజిక్కించుకున్నప్పటి నుంచి తన యూజర్లను కాపాడుకునేందుకు ట్విట్టర్‌ చమటోడ్చుతున్నది.