Congress | ఉద్యమ ఆకాంక్షల సాధన కాంగ్రెస్‌తోనే సాధ్యం: భట్టి విక్రమార్క
Congress విధాత: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కాంగ్రెస్ తోనే సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు కోదాడ నియోజకవర్గం రాఘవపురం గ్రామ శివారులో మాజీ శాసన సభ్యురాలు పద్మావతి ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రాఘవపురం క్రాస్ రోడ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో భట్టి ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరకుండా అడ్డుగా ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని […]

Congress
విధాత: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కాంగ్రెస్ తోనే సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు కోదాడ నియోజకవర్గం రాఘవపురం గ్రామ శివారులో మాజీ శాసన సభ్యురాలు పద్మావతి ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రాఘవపురం క్రాస్ రోడ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో భట్టి ప్రసంగించారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరకుండా అడ్డుగా ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జీవితాలు మారలేదని, కేసిఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల జీవితాలు మాత్రం బాగుపడ్డాయన్నారు. ప్రజల సంపదలను దోపిడీ చేసి బిఆర్ఎస్ పాలకులు వందల కోట్ల సంపాదనతో బాగుపడ్డారన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తున్న అధికారులను బదిలీలు, సస్పెన్షన్ పేరిట ఉద్యోగులను బిఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు.
దళిత గిరిజనుల వ్యతిరేకి కెసిఆర్. దళితున్ని సీఎం చేస్తానని దగా చేశారన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడన్నారు. మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను ధరణీ తో బలవంతంగా కేసీఅర్ ప్రభుత్వం గుంజుకుంటుందన్నారు.
దళిత బంధు పథకంలో 30% కమిషన్ తీసుకుంటున్న సిగ్గుమాలిన పాలకులని ద్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధులో లంచం తీసుకుంటున్న పాలకులను ప్రజలు, ఈ ప్రకృతి క్షమించదన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన కౌలు రైతు చట్టాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామన్నారు. రైతులకు ఇచ్చే రాయితీలు అన్ని కౌలు రైతులకు ఇస్తామన్నారు.
రాష్ట్రంలోని మానవ వరులను అభివృద్ధి చేయడం బాధ్యతని భావిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం లో నిర్బంధ విద్యను అందిస్తాన్నారు.
వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ప్రజా పార్టీ అధ్యక్షులు గద్దర్, సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న, కోదాడ, హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.