Congress | రైతులకు కాంగ్రెస్‌ గుడ్‌న్యూస్‌.. అధికారమిస్తే టైటిల్‌ గ్యారంటీ చట్టం

Congress 100 రోజుల్లోనే రెవెన్యూ సదస్సులు సమగ్ర భూ సర్వే చేపట్టి కొత్త… రెవెన్యూ రికార్డుల రూపకల్పన తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికై 11 అంశాలతో కాంగ్రెస్‌ భూమి డిక్లరేషన్‌ విడుదల విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడంతో పాటు టైటిల్‌ గ్యారంటీ చట్టంను తీసుకువస్తామని తెలిపింది. అలాగే తప్పుల తడకగా మారిన ధరణిని రద్దు […]

Congress | రైతులకు కాంగ్రెస్‌ గుడ్‌న్యూస్‌.. అధికారమిస్తే టైటిల్‌ గ్యారంటీ చట్టం

Congress

  • 100 రోజుల్లోనే రెవెన్యూ సదస్సులు
  • సమగ్ర భూ సర్వే చేపట్టి కొత్త…
  • రెవెన్యూ రికార్డుల రూపకల్పన
  • తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికై
  • 11 అంశాలతో కాంగ్రెస్‌ భూమి డిక్లరేషన్‌ విడుదల

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడంతో పాటు టైటిల్‌ గ్యారంటీ చట్టంను తీసుకువస్తామని తెలిపింది. అలాగే తప్పుల తడకగా మారిన ధరణిని రద్దు చేసి భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టేలా తప్పులు లేని కొత్త కంప్యూటర్‌ రికార్డును రూపొందించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి 11 అంశాలతో కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన కాంగ్రెస్‌ భూమి డిక్లరేషన్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా ఉన్న అంశాలు యాథావిధిగా…

  • “ధరణి”లో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధరణి వ్యవస్థను రద్దుచేసి నూతన కంప్యూటర్‌ రికార్డును రూపొందిస్తాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తాం.
  • నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
  • అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశంలోనే గతంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
  • వందకు పైగా ఉన్న భూచట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
  • కౌలుదారులకు ఋణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
  • కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
  • 2006 లో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
  • కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తాం.
  • రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చెయ్యడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమీషన్ ఏర్పాటు చేస్తాం..
  • భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
  • భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం.