Congress | కాంగ్రెస్ పార్టీతోనే సుపరిపాలన సాధ్యం: ప్రేమ్ సాగర్ రావు

Congress విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులో 150 మంది కార్యకర్తలు, మైనారిటీ నాయకులు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరగా వారికి ప్రేమ సాగర్ రావు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక వివిధ పార్టీల నుండి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో సుపరిపాలన […]

Congress | కాంగ్రెస్ పార్టీతోనే సుపరిపాలన సాధ్యం: ప్రేమ్ సాగర్ రావు

Congress

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులో 150 మంది కార్యకర్తలు, మైనారిటీ నాయకులు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరగా వారికి ప్రేమ సాగర్ రావు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక వివిధ పార్టీల నుండి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

దేశంలో, రాష్ట్రంలో సుపరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు . కర్ణాటక ఎన్నికల మాదిరిగానే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ,పీసీసీ సభ్యులు కొండ చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు,కౌన్సిలర్ రామగిరి భానేశ్,పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం మైనారిటీ నాయకులు ఇర్ఫాన్, ఖదీర్, తదితరులు పాల్గొన్నారు.