Congress | కాంగ్రెస్‌లోకి వలసల వెల్లువ

Congress క్యూ కడుతున్న ఇతర పార్టీల నేతలు జూపల్లి, కూచుకుళ్ల బాటలో యెన్నం..సరితా తిరుపతయ్యలు విధాత ప్రతినిధి, మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ధీ పాలమూరు జిల్లాలో రాజకీయ పార్టీల సమీకరణలు వేగంగా మారుతున్నాయి. PCC చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పార్టీ బలోపేతం దిశగా ఇతర పార్టీల నుండి చేరికలు పెరుగుతున్నాయి. ఇతర పార్టీల నుండి వలసలు ఒకటి రెండు నియోజకవర్గాలకే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ […]

  • Publish Date - July 19, 2023 / 12:32 PM IST

Congress

  • క్యూ కడుతున్న ఇతర పార్టీల నేతలు
  • జూపల్లి, కూచుకుళ్ల బాటలో యెన్నం..సరితా తిరుపతయ్యలు

విధాత ప్రతినిధి, మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ధీ పాలమూరు జిల్లాలో రాజకీయ పార్టీల సమీకరణలు వేగంగా మారుతున్నాయి. PCC చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పార్టీ బలోపేతం దిశగా ఇతర పార్టీల నుండి చేరికలు పెరుగుతున్నాయి. ఇతర పార్టీల నుండి వలసలు ఒకటి రెండు నియోజకవర్గాలకే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ MLC కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలు త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక్కడ మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వీరి రాకను వ్యతిరేకిస్తున్నారు. వీరిద్దరి మధ్య అవగాహన కుదిరి ఒక్కతాటి పైకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం లో తిరుగు లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్‌లోకి యెన్నం, సరితా తిరుపతయ్యలు

జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ BRS కు చెందిన సరితా తిరుపతయ్య అక్కడి BRS ఎమ్మెల్యేతో విభేధించి పార్టీ వీడుతోoది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండేందుకు సిద్ధమవుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన BRS మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 20న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని అనుకున్నారు. ఈ సభ వాయిదా పడoడంతో జూపల్లి చేరిక వాయిదా పడింది. ఇక్కడ జూపల్లి చేరికను టీపీపీసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ లో జగదీశ్వర్ రావు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పలు వార్డులకు చెందిన ఇతర పార్టీ ల నాయకులు కాంగ్రెస్ లో చేరారు.

నారాయణ పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోయిలకొండ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మణికొండ, సూరారం పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుముందు మరిన్ని భారీ చేరికలు ఉంటాయని శివకుమార్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు జి. మధుసూదన్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వల్ ల ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీ ల నాయకులు, పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇదే నియోజకవర్గం బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఆయన కాంగ్రెస్ లో చేరితే ఇక్కడ ఆ పార్టీ బలం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ లో ఊ హించని విధoగా చేరికలు ఉంటాయని ఇక్కడి నేతలు అంటున్నారు.