బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్‌ ప్ర‌భాక‌ర్‌కు లీగ‌ల్ నోటీస్ పంపిన కాంగ్రెస్‌

బీజేపీ నేత ఎన్‌వీఎస్ ఎస్‌ ప్రభాకర్‌కు కాంగ్రెస్ పార్టీ లీగల్‌ నోటీసు పంపింది. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ కాంగ్రెస్‌ నాయకుల నుంచి బెంజ్‌ కారు లబ్ది పొందినట్లు ఆయ‌న ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే.

బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్‌ ప్ర‌భాక‌ర్‌కు లీగ‌ల్ నోటీస్ పంపిన కాంగ్రెస్‌

విధాత‌: బీజేపీ నేత ఎన్‌వీఎస్ ఎస్‌ ప్రభాకర్‌కు కాంగ్రెస్ పార్టీ లీగల్‌ నోటీసు పంపింది. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ కాంగ్రెస్‌ నాయకుల నుంచి బెంజ్‌ కారు లబ్ది పొందినట్లు ఆయ‌న ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే. ఏలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ స్పందించారు.


కాగా.. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి, రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని దీపాదాస్‌ మున్షీ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆధారాలు చూపించక పోయినట్లయితే రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు దీపాదాస్‌ మున్షీ హెచ్చరించిన విషయం తెలిసిందే. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ ఎలాంటి ఆధారాలు చూపింక పోవ‌డంతో దీపాదాస్ మున్సీ లీగల్ నోటీస్ పంపించారు.