Narsa Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్సారెడ్డి ఇక లేరు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్సారెడ్డి(92) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు
Narsa Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్సారెడ్డి(92) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నర్సారెడ్డి మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిర్మల్ జిల్లాలోని మలక్‌చించొలి గ్రామంలో 1931, సెప్టెంబర్ 22న నర్సారెడ్డి జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్‌గా పని చేశారు. 1974-78 మధ్య రెవెన్యూ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా సేవలందించారు. 1971-72 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పని చేశారు. 1962-78 మధ్య ఎమ్మెల్యేగా, 1981-85 మధ్య ఎమ్మెల్సీగా కొనసాగారు. 1977-78 మధ్య నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్‌గా ఉన్నారు. లోక్‌సభకు ఒకసారి ఎన్నికయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram