Karnataka | కర్ణాటకలో వీడని ఉత్కంఠ.. సీఎం సిద్ధరామయ్యనా.. శివకుమారా..?
Karnataka | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించిన విషయం విదితమే. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారనే విషయంపై సస్పెన్ష్ వీడలేదు. ఆ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కర్ణాటక పీఠాన్ని ఎవరికి అప్పగించాలనే అంశంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య నిన్న ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలిసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా […]

Karnataka | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించిన విషయం విదితమే. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారనే విషయంపై సస్పెన్ష్ వీడలేదు. ఆ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కర్ణాటక పీఠాన్ని ఎవరికి అప్పగించాలనే అంశంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సుదీర్ఘ చర్చలు జరుపుతోంది.
సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య నిన్న ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలిసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో డీకే శివకుమార్ కూడా ఇవాళ హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ ఇద్దరిలో ఎవర్నీ ముఖ్యమంత్రి పీఠం వరిస్తుందో మరో 24 గంటలు వేచి చూడాల్సిందే. మంగళవారం రాత్రి వరకు ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించిన పరిశీలకుల బృందం.. నిన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించింది. ఆదివారం రహస్య ఓటింగ్ ద్వారా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించారు. మొత్తంగా ఈ రాత్రికి కర్ణాటక సీఎం ఎవరనే విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఈ పరిణామాల నేపథ్యం ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌తో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తాను పార్టీ అగ్ర నాయకత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం లేదు. రెబెల్‌గా మారడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ఎవరూ కష్టపడ్డారనేది పార్టీ అగ్రనాయకత్వం గుర్తించాలన్నారు. తాను చిన్న పిల్లాడిని కాదు.. ఎవరి ఉచ్చులో పడనని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపిస్తావనే నమ్మకం తనకు ఉందని సోనియా గాంధీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను శివకుమార్ గుర్తు చేశారు.