ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాత‌ర‌

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలిపోయింది

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాత‌ర‌
  • గాయ‌ప‌డిన డీఆర్‌జీ జ‌వాన్‌
  • 2 రోజుల్లో 2వ సంఘటన



విధాత‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) జవాన్ గాయపడిన‌ట్టు పోలీసు అధికారి తెలిపారు. కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేటోంగ్ గ్రామ సమీపంలో పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.


సోమవారం జరిగిన ఇదే త‌ర‌హా ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని వెల్ల‌డించారు. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు పేలుడు ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంతో పోలీసులు మరింత అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. గ‌స్తీని మ‌రింత పెంచారు.


నక్సల్ ప్ర‌భావిత ప్రాంత‌మైన సలేటోంగ్‌లో రాష్ట్ర పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కొత్త క్యాంపును మంగళవారం ఏర్పాటు చేశారు. రహదారి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు బందోబ‌స్తు క‌ల్పించ‌డానికి క్యాంపు ఏర్పాటుచేసిన‌ట్టు అధికారులు తెలిపారు.