Coromandel | కోర‌మండ‌ల్ లూప్‌లైన్‌లోకి వెళ్ల‌డంతోనే ప్ర‌మాదం..! అసలు లూప్‌లైన్ అంటే ఏమిటి..?

Coromandel | సిగ్న‌ల్ లోపం కార‌ణంగానే ప్ర‌మాదం లూప్ లైన్‌లోకి వెళ్ల‌డం వ‌ల్లే ఘోరం విధాత: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్రాథ‌మిక ద‌ర్యాప్తు నివేదికను రైల్వే ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. సిగ్న‌ల్ లోపం కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ప్ర‌మాదానికి కొద్ది క్ష‌ణాల ముందు కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌.. లూప్ లైన్‌లోకి వెళ్ల‌డం వ‌ల్లే ఘోరం జ‌రిగింద‌ని తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిందిలా.. బాలాసోర్ జిల్లాలోని బ‌హాన‌గా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఓ గూడ్స్ రైలు ఆగింది. అయితే […]

  • By: krs    latest    Jun 03, 2023 12:48 PM IST
Coromandel | కోర‌మండ‌ల్ లూప్‌లైన్‌లోకి వెళ్ల‌డంతోనే ప్ర‌మాదం..! అసలు లూప్‌లైన్ అంటే ఏమిటి..?

Coromandel |

  • సిగ్న‌ల్ లోపం కార‌ణంగానే ప్ర‌మాదం
  • లూప్ లైన్‌లోకి వెళ్ల‌డం వ‌ల్లే ఘోరం

విధాత: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్రాథ‌మిక ద‌ర్యాప్తు నివేదికను రైల్వే ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. సిగ్న‌ల్ లోపం కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ప్ర‌మాదానికి కొద్ది క్ష‌ణాల ముందు కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌.. లూప్ లైన్‌లోకి వెళ్ల‌డం వ‌ల్లే ఘోరం జ‌రిగింద‌ని తెలిపారు.

ప్ర‌మాదం జ‌రిగిందిలా..

బాలాసోర్ జిల్లాలోని బ‌హాన‌గా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఓ గూడ్స్ రైలు ఆగింది. అయితే గంట‌కు 130 కిలోమీట‌ర్ల వేగంతో కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ దూసుకు వ‌చ్చింది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌.. మెయిన్ లైన్‌లోకి బ‌దులుగా లూప్‌లైన్‌లోకి ప్ర‌వేశించింది.

మెయిన్ లైన్‌లోకి వెళ్లేందుకు స్టేష‌న్ మాస్ట‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. కానీ మ‌ళ్లీ సిగ్న‌ల్ ఆపేశారు. సిగ్న‌ల్ ఇచ్చి వెన‌క్కి తీసుకోవ‌డంతో లూప్‌లైన్‌లోకి ప్ర‌వేశించింది కోర‌మండ‌ల్(Coromandel) ఎక్స్‌ప్రెస్‌. అప్ప‌టికే లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్స్ రైలును కోర‌మండ‌ల్ ఢీకొట్టింది.

దీంతో కోర‌మండ‌ల్ ఇంజిన్ గూడ్స్ రైలు పైకి ఎక్కింది. కోర‌మండ‌ల్ బోగీలు ప‌క్క ట్రాక్‌పై ప‌డిపోయాయి. అదే స‌మ‌యంలో అదే ట్రాక్‌ పైకి వేగంగా దూసుకొచ్చిన బెంగ‌ళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్‌.. కోరమండ‌ల్ బోగీల‌ను ఢీకొట్టింది. ఇదంతా 15 నిమిషాల వ్య‌వ‌ధిలో జ‌రిగిపోయింది.

మ‌రి లూప్ లైన్ అంటే ఏమిటి..?

లూప్ అంటే వ‌క్ర‌రేఖ అని అర్థం. రైల్వేల్లో లూప్ లైన్ అనేది మెయిన్ లైన్ నుంచి విభ‌జింప‌బడుతుంది. స్టేష‌న్ నుంచి కొంత దూరం వ‌ర‌కు లూప్ లైన్ నిర్మించ‌బ‌డి ఉంటుంది. ప్ర‌ధాన‌ స్టేష‌న్‌లో ప్ర‌ధానంగా ఉండే రెండు మెయిన్ లైన్ల‌కు ఇరు వైపులా రెండు లూప్ లైన్ల‌ను కూడా ఏర్పాటు చేస్తారు.