Covid: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రేప‌ట్నుంచి కొవిడ్ బూస్ట‌ర్ డోస్ పంపిణీ

విధాత‌: ప్ర‌పంచ వ్యాప్తంగా, దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రేప‌ట్నుంచి కొవిడ్ బూస్ట‌ర్ డోస్ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే బూస్ట‌ర్ డోస్‌గా కార్బోవ్యాక్స్ టీకాను అందించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 5 ల‌క్ష‌ల కార్బోవ్యాక్స్ టీకా డోసుల‌ను ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీకాలు రాష్ట్రంలోని అన్ని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలతో పాటు యూపీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. మొద‌టి రెండు డోసులు […]

Covid: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రేప‌ట్నుంచి కొవిడ్ బూస్ట‌ర్ డోస్ పంపిణీ

విధాత‌: ప్ర‌పంచ వ్యాప్తంగా, దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రేప‌ట్నుంచి కొవిడ్ బూస్ట‌ర్ డోస్ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే బూస్ట‌ర్ డోస్‌గా కార్బోవ్యాక్స్ టీకాను అందించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

5 ల‌క్ష‌ల కార్బోవ్యాక్స్ టీకా డోసుల‌ను ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీకాలు రాష్ట్రంలోని అన్ని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలతో పాటు యూపీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. మొద‌టి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్ట‌ర్ డోస్‌గా కార్బోవ్యాక్స్ తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.