CPI Narayana
విధాత: బీఆరెస్, బీజేపీ పార్టీల మధ్య బంధంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలకు హాజరైన నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు రమ్మంటే కవితమ్మ నేను చాల బిజీగా ఉన్నానని, నేను రాలేనంటూ చెప్పిందన్నారు. ఆమె వంకాయాలు, బెండకాయలు కోసే పనిలో బీజీగా ఉన్నారన్నట్లుగా ఆమె బీజీగా ఉన్నానని చెప్పగానే కోర్టు, ఈడీలు ఆ మాటలను నమ్మి మీకెప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే రండి తల్లి అని చెప్పాయన్నారు.
ఈ వ్యవహారం పరిశీలిస్తే బీజేపీ సలహా లేకుండా ఆశీర్వాదం లేకుండా కోర్టులు, ఈడీలు అలా చెప్పగలవా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్‌ల మధ్య బంధానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్నారు. ఇంకా ఎందుకు అబద్ధాలతో బుకాయిస్తారంటు ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎంలు మూడు ఒకే బంతిలోని తోడు దొంగలే అంటూ నారాయణ విమర్శించారు.