NALGONDA: కస్టమ్ మిల్లింగ్ బియ్యం.. 28% పెండింగ్

విధాత: రాష్ట్రంలో 2021-22 యాసంగి సీజన్ కస్టమ్ మిల్లింగ్ బియ్యం గడువు జనవరి 31వ తేదీతో ముగిసిపోగా ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంకు సంబంధించి నల్గొండ జిల్లా పరిధిలో 72 శాతం బియ్యం మాత్రమే తిరిగి పౌరసరఫరాల సంస్థకు చేరింది. ఇంకా 28 శాతం బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోయింది. దీంతో మిల్లర్లు కష్టమ్ మిల్లింగ్ బియ్యం ఇచ్చే గడువు పెంపు కోసం మరోసారి ప్రభుత్వం వద్ద చక్రం తిప్పేందుకు సన్నద్ధమయ్యారు. నల్గొండ జిల్లా పరిధిలో 108 […]

  • By: krs    latest    Feb 01, 2023 1:07 PM IST
NALGONDA: కస్టమ్ మిల్లింగ్ బియ్యం.. 28% పెండింగ్

విధాత: రాష్ట్రంలో 2021-22 యాసంగి సీజన్ కస్టమ్ మిల్లింగ్ బియ్యం గడువు జనవరి 31వ తేదీతో ముగిసిపోగా ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంకు సంబంధించి నల్గొండ జిల్లా పరిధిలో 72 శాతం బియ్యం మాత్రమే తిరిగి పౌరసరఫరాల సంస్థకు చేరింది. ఇంకా 28 శాతం బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోయింది.

దీంతో మిల్లర్లు కష్టమ్ మిల్లింగ్ బియ్యం ఇచ్చే గడువు పెంపు కోసం మరోసారి ప్రభుత్వం వద్ద చక్రం తిప్పేందుకు సన్నద్ధమయ్యారు. నల్గొండ జిల్లా పరిధిలో 108 రైస్ మిల్లులకు ప్రభుత్వం యాసంగి సీజన్లో 3,27,650 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా 2,22,807 మెట్రిక్ టన్నుల బియ్యంను తిరిగి రావాల్సి ఉండగా 1,59,587 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి మిల్లింగ్ చేసి ఇచ్చారు.

మరో 63 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుండి రావాల్సి ఉంది. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 ఖరీఫ్ సీజన్ కు చెందిన మరో 7లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం మిల్లర్ల నుండి ప్రభుత్వానికి అందాల్సి ఉందని పౌరసరపాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇవ్వడంలో మిల్లర్లు చేస్తున్న జాప్యం విమర్శల పాలవుతుంది. కొందరు మిల్లర్లు పిడిఎస్ బియ్యాన్ని రీస్లైకింగ్ చేస్తూ ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లుగా ఆరోపణలు చోటు చేసుకున్నాయి.

మరికొందరు ప్రభుత్వం ఇచ్చే ధాన్యం బియ్యాన్ని ముందుగా అమ్ముకొని, గడువు తీరాక నెమ్మదిగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇస్తున్నారు. మిల్లుల తనిఖీల్లో ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన వందల కోట్ల ధాన్యం నిల్వలు లేకపోవడం గతంలో వివాదస్పదమైంది.