తెలంగాణ ఉద్యమ కవి దాశరథి స్పెషల్ స్టోరీ
విధాత, ప్రతినిధి నిజామాబాదు: తెలంగాణ ప్రజానీకం బానిస బతుకుల బతుకుతున్న రోజులవి..నిజాం నిరంకుశ పాలనా కొనసాగుతున్న కాలమది..నిజాం సైనిక అధికారి ఖాసీం రజ్వి పన్నుల రూపంలో తెలంగాణ ప్రజల రక్తం పీల్చుతూ ఆడపడుచుల మానాలతో, నగ్నంగా బతుకమ్మలాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న తరుణం. నిరంకుశ నిజాం అరాచకాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా నిలిచి నిరంకుశ పాలనను ఎదురించిన అక్షర యోధుడు దాశరథి.
అక్షరాలని ఆయుధాలుగా మలిచిన కలం వీరుడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ సగర్వంగా ప్రకటించిన కవి. తన కవితలతో, సాహిత్యాలతో ప్రజలను జాగృతం చేసిన మహనీయుడు అయన. మహాకవి ,సాహితీవేత్త ఆ మహనీయుడు దాశరథి కృష్ణమచార్యులపై విధాత అందిస్తున్న ప్రత్యేక కథనం.
దాశరథి కృష్ణమచార్య వరంగల్ జిల్లా గూడూరులో 1952 లో జన్మించారు. నాటి రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వరకు ప్రతి పోరాటానికి ప్రేరణగా నిలిచింది దాశరథి కృష్ణమచార్య కవిత్వం. తెలంగాణ తోలి దశ ఉధ్యమంలో తన కవితలతో తెలంగాణ ప్రజానీకానికి జాగృతం చేస్తున్న తరుణంలో నిజాం ప్రభువు గ్రహించి, తనను సంకెళ్లు వేసి కారాగారంలో బంధించారు నిజాం.
ఆ కారాగారమే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఖిల్లా జైలు. ఇక్కడే దాశరథిని చెరసాలలో వేసి నరక యాతన చేశారు. తన గొంతు నొక్కాలని నిజాం చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. తెలంగాణ యాసను ,భాషను, సంస్కృతి, సంప్రదాయాలను ఇక్కడి ప్రజల రైతాంగం పై నిజాం ప్రభువు అకృత్యాలు ,అరాచకాలను దాశరథి కృష్ణమచార్యులు ఎదురించారు. తన కవితలతో తెలంగాణ ప్రాంత ప్రజలను జాగృతం చేస్తున్న తరుణంలో దాశరథిని సంకెళ్లు వేసి వరంగల్ నుండి నిజామాబాదు జైలుకు తరలించారు.
నాడు దాశరథిని వివిధ రకాలుగా చెరసాలలో శిక్షించడం జరుగుతున్న తరుణంలో జైలు నుండే తన కవిత అగ్నిధారలు పుట్టిస్తూ తెలంగాణ ప్రజానికంలో చైతన్య జ్యోతులు రగిలించింది. జైలు నుంచే నిజాం అరాచకాలను కవితల రూపంలో తెలియ పరిచారు. ఇందులో భాగంగా నిజామాబాదు ఖిల్లా జైలు గోడలపై తన కలం నుండి జాలువారిన ఉద్యమ గీతికా ” ఓ నిజాం పిశాచమా కానరాడు నిను బోలిన రాజు మాకెన్నడేని..తీగెలను తెంపి అగ్గిలో దింపినావు..నా తెలంగాణ కోటి రతనాల వీణ “.
ఆ సమయంలో దాశరథి రాసిన ఈ కవితాక్షరాలు ఉద్యమకారులకు, కవులకు ,కళాకారులకు నుండి సామాన్య ప్రజానీకానికి ఆలోచింప చేసి పోరాటంలో భాగ్యస్వాములను చేసింది. దీనితో తెలంగాణలో అప్పట్లో రైతాంగ సాయుధ, నిజాం నిరంకుశ పాలనకు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం దాశరథిని నిజామాబాద్ కారాగారం నుండి విడుదల చేస్తున్నట్లుగా నిజాం ప్రకటించడం జరిగింది. అంతటి కవిత శక్తి కలదు కలానికి. నాటి నిజాం నిరంకుశ పాలనా నుండి విముక్తి.. మొన్నటి ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన ఇచ్చిన పోరాట స్ఫూర్తి ఎనలేనిది.
పర్యాటక ప్రాంతం కోసం ఆరాటం
దాశరథిని బంధించిన నాటి ఖిల్లా జైలును ప్రభుత్వం దాశరథి పేరిట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా జైలును అక్కడి నుండి తరలించి నిజాంబాద్ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగపూర్ కు తరలించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కారులు ,కవులు, నిజామాబాదు జిల్లా వాసులు, ఖిల్లా గుట్ట పై మరో పురాతన ఆలయం శ్రీసీతా రాముల వారి ఆలయం కలదు.
కొండకు అనుకొనే రఘునాథ చెరువు, ఆ చెరువును ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్ గా రూపుదాల్చింది. ఇలా అన్ని విధాలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉందని, జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుండి దాశరథిని బంధించిన ఖిల్లా ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి వినతులు, డిమాండ్ వెలువెత్తుతున్నాయి. ఆ మహనీయుని, వైతాళికుని మనమంతా తలచుకుంటూ…ఆయన కన్నా కలలు, ఆశయాలు నిజాం చేద్దాం, పోరాట స్ఫూర్తి తో మెలుగుదాం.