Hyderabad | నిద్ర మాత్ర‌లిచ్చి కూతురిపై లైంగిక‌దాడి.. తండ్రికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌

Hyderabad | కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురి( Daughter )పైనే తండ్రి( Father ) క‌న్నేశాడు. కామంతో ఆమెపై చెల‌రేగిపోయాడు. భోజ‌నంలో నిద్ర‌మాత్ర‌లు( Sleeping Pills ) ఇచ్చి ప‌లుమార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ క్రూర‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డ నిందితుడికి కోర్టు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావ‌రి( East Godavari ) జిల్లాకు చెందిన ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు( Couples ) త‌మ కూతురితో క‌లిసి కొన్నేండ్ల క్రితం బ‌తుకుదెరువు కోసం హైద‌రాబాద్‌( […]

Hyderabad | నిద్ర మాత్ర‌లిచ్చి కూతురిపై లైంగిక‌దాడి.. తండ్రికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌

Hyderabad | కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురి( Daughter )పైనే తండ్రి( Father ) క‌న్నేశాడు. కామంతో ఆమెపై చెల‌రేగిపోయాడు. భోజ‌నంలో నిద్ర‌మాత్ర‌లు( Sleeping Pills ) ఇచ్చి ప‌లుమార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ క్రూర‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డ నిందితుడికి కోర్టు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావ‌రి( East Godavari ) జిల్లాకు చెందిన ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు( Couples ) త‌మ కూతురితో క‌లిసి కొన్నేండ్ల క్రితం బ‌తుకుదెరువు కోసం హైద‌రాబాద్‌( Hyderabad )కు వ‌చ్చారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌( Film Nagar )లో భ‌ర్త వాచ్‌మెన్‌గా ప‌ని చేస్తుండ‌గా, భార్య ఇండ్ల‌లో ప‌ని చేస్తూ కుటుంబానికి ఆస‌రాగా నిలుస్తోంది. వీరి కుమార్తె(14), కుమారుడు ఉన్నారు. కుమారుడు తూర్పు గోదావ‌రిలోని ఓ హాస్ట‌ల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కూతురేమో త‌ల్లిదండ్రుల వద్ద ఉంటోంది.

అయితే 2021, జులై నెల‌లో కూతురు వాంతులు చేసుకుంది. దీంతో ఆమెను త‌ల్లి నాంప‌ల్లిలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి తీసుకెళ్లి వైద్య ప‌రీక్ష‌లు చేయించింది. కూతురు 4 నెల‌ల గ‌ర్భిణి వైద్యులు నిర్ధారించారు. కూతుర్ని త‌ల్లి ప్ర‌శ్నించ‌గా.. జ‌రిగిన ఘోరాన్ని తెలిపింది. త‌ల్లి ఇంట్లో లేని స‌మ‌యంలో ఆహారంలో నిద్ర‌మాత్ర‌లు ఇచ్చి తండ్రి లైంగిక‌దాడికి పాల్ప‌డేవాడ‌ని కూతురు పేర్కొంది. ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించేవాడ‌ని చెప్పింది. ఈ విష‌యం తెలుసుకున్న తండ్రి ప‌రారీ అయ్యాడు.

కూతురు ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించిన అత‌నిపై త‌ల్లి జూబ్లీహిల్స్‌( Jublee Hills ) పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి.. తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ కేసును విచారించిన నాంప‌ల్లి కోర్టు( Nampally Court ) నిందితుడికి యావ‌జ్జీవ కారాగార శిక్ష( Life sentence ) విధించింది. రూ. 5 వేల జ‌రిమానా కూడా విధించింది. మెట్రో లీగ‌ల్ స‌ర్వీస్ ద్వారా అథార్టీ ద్వారా బాలిక‌కు రూ. 7 ల‌క్ష‌లు సాయం అందించాల‌ని కోర్టు ఆదేశించింది.