Rajnath Singh | అవసరమైతే ‘హద్దు’ మీరుతాం: రాజ్‌నాథ్‌సింగ్‌

Rajnath Singh ఆనాడు పాకిస్థాన్‌ వెన్నుపోటు వల్లే యుద్ధం అన్ని యుద్ధాల్లోనూ సైనికులకు ప్రజా మద్దతు ఈసారి ప్రత్యక్షంగా యుద్ధరంగంలో నిలవాలి కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకల్లో రాజ్‌నాథ్‌సింగ్‌ అమర జవాన్లకు రక్షణ మంత్రి పుష్పాంజలి లద్దాఖ్‌: తన గౌరవాన్ని, ప్రతిష్ఠను కాపాడుకునేందుకు అవసరమైతే నియంత్రణ రేఖను దాటేందుకు సైతం భారతదేశం సిద్ధంగా ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. కార్గిల్‌ యుద్ధానికి 24 ఏళ్లు నిండిన నేపథ్యంలో లద్దాఖ్‌లోని ద్రాస్‌ సెక్టర్‌లో బుధవారం […]

  • By: Somu    latest    Jul 26, 2023 11:21 AM IST
Rajnath Singh | అవసరమైతే ‘హద్దు’ మీరుతాం: రాజ్‌నాథ్‌సింగ్‌

Rajnath Singh

  • ఆనాడు పాకిస్థాన్‌ వెన్నుపోటు వల్లే యుద్ధం
  • అన్ని యుద్ధాల్లోనూ సైనికులకు ప్రజా మద్దతు
  • ఈసారి ప్రత్యక్షంగా యుద్ధరంగంలో నిలవాలి
  • కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకల్లో రాజ్‌నాథ్‌సింగ్‌
  • అమర జవాన్లకు రక్షణ మంత్రి పుష్పాంజలి

లద్దాఖ్‌: తన గౌరవాన్ని, ప్రతిష్ఠను కాపాడుకునేందుకు అవసరమైతే నియంత్రణ రేఖను దాటేందుకు సైతం భారతదేశం సిద్ధంగా ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. కార్గిల్‌ యుద్ధానికి 24 ఏళ్లు నిండిన నేపథ్యంలో లద్దాఖ్‌లోని ద్రాస్‌ సెక్టర్‌లో బుధవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహించారు. ఈ కార్యమంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. నాటి పోరాటంలో అమరులైన 559 మంది సైనికుల బలిదానాన్ని స్మరించుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. నియంత్రణ రేఖ దాటాల్సి వస్తే ఆ సమయంలో సైనికులకు జావత్‌ భారత జాతి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. పౌరులు భాగస్వాములు కావడం వల్లే ఆ యుద్ధం ఏడాదిగా కొనసాగుతున్నదని చెప్పారు. భారతదేశంలో కార్గిల్‌ యద్ధాన్ని పాకిస్థాన్‌ రుద్దిందని రాజ్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాకిస్థాన్‌ మనల్ని వెన్నుపోటు పొడించింది. యుద్ధాన్ని దేశంపై రుద్దింది. యుద్ధ వాతావరణం వచ్చిన ప్రతి సందర్భంలోనూ సాయుధ దళాలకు మద్దతుగా మన ప్రజలు నిలిచారు. అయితే.. వారు పరోక్షంగా మద్దతు ఇచ్చారు.

కానీ.. ఈసారి అలాంటి పరిస్థితి వస్తే.. అవసరమైతే ప్రజలు ప్రత్యక్షంగా యుద్ధరంగంలో సైనికులకు మద్దతుగా నిలవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకునేందుకు అవసరమైతే ఎంతటికైనా తెగిస్తామన్న రాజ్‌నాథ్‌.. ఈ క్రమంలో నియంత్రణరేఖను దాటాల్సి వస్తే.. అందుకు సిద్ధమని ప్రకటించారు.

1999 నాటి కార్గిల్‌ యుద్ధంలో చనిపోయిన అమర జవాన్లను స్మరించుకుంటూ.. భరత మాత రక్షణ కోసం వారు ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడలేదని కొనియాడారు. సాహసోపేతులైన భరత మాత ముద్దుబిడ్డలకు సలాం చేస్తున్నానన్నారు. అంతకు ముందు అమర జవాన్ల స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

1999లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత్‌ విజయానికి గుర్తుగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను ఏటా జూలై 26వ తేదీన నిర్వహిస్తున్నారు. కార్గిల్‌ యుద్ధంగా ప్రాముఖ్యం పొందిన ఈ యుద్ధం.. పాకిస్థాన్‌ జవాన్లను కార్గిల్‌ ప్రాంతంలోని టోలోలింగ్‌, టైగర్‌ హిల్‌ నుంచి తరిమి కొట్టడంతో ‘ఆపరేషన్‌ విజయ్‌’ విజయవంతంగా ముగిసింది. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా అమరవీరుల త్యాగాలను ప్రధాని నరేంద్రమోదీ స్మరించుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. వారి త్యాగాలు యావత్‌ దేశానిని నిత్యం స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.