విధాత: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్క రోజునే 2లక్షల మంది దర్శనానికి తరలిరాగా, ఆదివారం సెలవు దినం కావడంతో 3లక్షల మందికి పైగా భక్తులు గణపయ్య దర్శనానికి తరలివచ్చారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు గణనాథుడి దర్శనం కోసం వస్తుండగా, పలువురు వీఐపీలు సైతం దర్శించుకున్నారు.
దశ మహా విద్యాగణపతి రూపంలో 63అడుగుల 28అడుగుల వెడల్పుతో నిర్మించారు. ఇరువైపుల సరస్వతి, వారాహి అమ్మరార్లు, కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీనరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రత స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. 1954ను సింగరి శంకరయ్యతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతు వస్తున్నాయి. తొలి ఏడాది అడుగు ఎత్తుతో మొదలైన ఈ గణనాథుడి విగ్రహం ఎత్తు ఏటా అడుగు పెంచుతూ వస్తున్నారు.