Anushka Shetty | అనుష్క 6వ తరగతి ప్రేమకథ తెలుసా? ఇలా అయితే ఎలా అనుష్కా?
Anushka Shetty విధాత: ఈ భామ ఆరడుగులకు దగ్గర దగ్గర ఎత్తు.. అమాయకత్వం, అందమైన రూపం. పాత్రల్లో ప్రయోగాలను కూడా ఇష్టపడే తత్వం ఆమె సొంతం. ఎటువంటి పాత్రకైనా జీవం పోయగలదు. అయితే ఆ మధ్య చేసిన ఓ ప్రయోగంతో.. పాపం బాగా లావుగా అయిపోయి.. ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంది. అర్థమైందా.. ఆ భామ ఎవరో.. అనుష్క శెట్టి. ‘బాహుబలి’ సినిమాలో దేవసేనగా ముసలి పాత్రలో కనిపించి మెప్పించింది. అలాగే ‘సైజ్ జీరో’ అంటూ బొద్దుగా […]

Anushka Shetty
విధాత: ఈ భామ ఆరడుగులకు దగ్గర దగ్గర ఎత్తు.. అమాయకత్వం, అందమైన రూపం. పాత్రల్లో ప్రయోగాలను కూడా ఇష్టపడే తత్వం ఆమె సొంతం. ఎటువంటి పాత్రకైనా జీవం పోయగలదు. అయితే ఆ మధ్య చేసిన ఓ ప్రయోగంతో.. పాపం బాగా లావుగా అయిపోయి.. ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంది. అర్థమైందా.. ఆ భామ ఎవరో.. అనుష్క శెట్టి. ‘బాహుబలి’ సినిమాలో దేవసేనగా ముసలి పాత్రలో కనిపించి మెప్పించింది.
అలాగే ‘సైజ్ జీరో’ అంటూ బొద్దుగా మారిపోయి చిక్కుల్లో పడింది. సినిమా కోసం ఎంత సాహసమైనా చేయగలదు కానీ.. జాణతనం తెలియని అమాయకురాలని ఆమె ఫ్యాన్స్ బాధ పడుతున్నారట. ఏ క్యారెక్టర్ చేసినా ఇట్టే పాత్రలో ఒదిగిపోగల నైపుణ్యం అనుష్కకు మాత్రమే సొంతం. ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చాకా.. మళ్ళీ నవీన్ పోలిశెట్టితో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటిగా ఎంత మంచి పేరు తెచ్చుకుని బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారినా, సినిమాలేవీ చేయకుండా ఖాళీగా ఉన్నా కూడా అనుష్క నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తన గురించి ఏదో వార్త సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తూనే ఉంటుంది. ఇన్ని రూమర్స్ చాలవన్నట్టు ఆమధ్య అనుష్క ఓ ఇంటర్య్వూలో తన చిన్ననాటి ఓ స్టోరీని చెప్పడం.. అది కాస్త వైరల్ అవుతూ.. ఆమెని వార్తలలో నిలబెట్టడం జరిగిపోతున్నాయి. ఇంతకీ అనుష్క ఏం చెప్పిందంటే..
‘‘నేను ఆరో తరగతి చదువుతున్న టైంలో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. అందంగా ఉంటానని ధైర్యంగా చెప్పి, లవ్ చేస్తున్నట్టు చెప్పగానే నేను కూడా ఇష్టపడ్డాను. ఇదంతా నాకు తెలియని వయసులో జరిగింది. ఆ తర్వాత ఎవరితోనూ ప్రేమలో పడలేదు’’ అని చెప్పుకొచ్చింది.
అమాయకత్వంతో అనుష్క ఏదో చెప్పినా అది కూడా పెద్ద విషయం అన్నట్టు నెట్టింట వైరల్ అయ్యి తిరుగుతుంది. పెద్ద హీరోయిన్ స్థానాన్ని అందుకున్నా కానీ అనుష్కలో ఉన్న అమాయకత్వంలో మార్పు రాలేదు. ఈ అమాయకత్వంపై అభిమానులు కాస్త తెలివిగా ఉంటే బావుండు అని అనుకుంటున్నారు. మరి అనుష్కకి ఎప్పుడు తెలివి వస్తుందో.. ఏంటో అని ఆమెపై జాలిపడుతున్నారు. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.