Helmet Rules | వాహనదారులకు అలెర్ట్.. హెల్మెట్ పెట్టుకున్నామంటే సరిపోదు..! ఈ రూల్స్ పాటించకుంటే జరిమానే..!
Helmet Rules | ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్‌ను ధరించడం ముఖ్యం. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఈ హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది. దేశంలో రోజుకు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో హెల్మెట్ ధరించకపోవడంతో తలకు గాయాలై మృతి చెందినవే ఎక్కువ. ఈ క్రమంలో హెల్మెట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచిస్తుంటారు. అయితే, హెల్మెట్ ధరించకపోతే పోలీసులు వాహనదారుడిని అపడంతో పాటు జరిమానాలు […]
Helmet Rules | ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్‌ను ధరించడం ముఖ్యం. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఈ హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది. దేశంలో రోజుకు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో హెల్మెట్ ధరించకపోవడంతో తలకు గాయాలై మృతి చెందినవే ఎక్కువ. ఈ క్రమంలో హెల్మెట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచిస్తుంటారు. అయితే, హెల్మెట్ ధరించకపోతే పోలీసులు వాహనదారుడిని అపడంతో పాటు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. కానీ, తాజాగా హెల్మెట్ పెట్టుకోవడమే కాదండోయ్.. హెల్మెట్‌లకు సంబంధించి రూల్స్‌ను సైతం పాటించాల్సిందే. లేకపోతే జరిమానాలు కూడా కట్టాల్సి రానుంది. ఈ రూల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం రండి..!
రూల్స్ ఇవే..
నిబంధనల మేరకు హెల్మెట్‌ను ప్రమాదం జరిగిన సమయంలో గరిష్ఠంగా రక్షణ అందించే మెటీరియల్‌తో తయారు చేసి ఉండాలి. దాంతో పాటు ఆకారం సైతం చాలా ముఖ్యమైన విషయం. వాహనదారుడు హెల్మెట్‌ను ధరించాడా? లేదా? అనే దాని కంటే ఎలా ధరించాడనేదే కీలకం. వాహనదారుడు హెల్మెట్‌ను పెట్టుకున్న సమయంలో దానికి ఉండే పట్టీని సరిగ్గా బిగించి ఉండాలి. హెల్మెట్ ఉంది.. తలకు పెట్టుకున్నామంటే సరిపోదు. హెల్మెట్ వెయిట్ 1.2 కిలోల వరకు ఉండాలి. నాణ్యమైన మెటీరియల్‌తో తయారైన హెల్మెట్‌ను మాత్రమే ఉపయోగించాలి.
కనీస మందం 20-25 మిల్లీమీటర్లు ఉండాలి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకారం.. హెల్మెట్‌లకు ఐఎస్‌ఐ (ISI) గుర్తు తప్పనిసరిగా ఉండాలి. ఐఎస్‌ఐ మార్క్ లేని హెల్మెట్లు ధరించడంతో పాటు విక్రయించడం రెండు నేరమే. హెల్మెట్‌లో పారదర్శకమైన కంటి కవర్‌ను వినియోగించాలి. హెల్మెట్ కోసం బీఐఎస్ (BIS) సర్టిఫికెట్ ముఖ్యం. చట్టవిరుద్ధమైన హెల్మెట్ ఉపయోగించి పట్టుబడినా.. నిబంధనలను పాటించడంలో విఫలమైతే హెల్మెట్‌ను జప్తు చేసే అవకాశం ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram