UP Police challan | స్కూటర్ ధర లక్ష.. జరిమానా 21 లక్షలు!
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన యువకుడికి రూ.21 లక్షల జరిమానా! ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్‌మీడయాలో తెగ వైరల్ అయింది. స్కూటర్ లక్ష ఐతే, ఫైన్ 21 లక్షలా అని జనాలు ఆశ్చర్యపోయారు.
UP Man Fined ₹21 Lakh for Not Wearing Helmet — Social media surprised
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక స్కూటర్ రైడర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.21 లక్షల జరిమానా విధించడంతో సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేగింది. లక్ష రూపాయల స్కూటర్‌పై 21 లక్షల చలానా రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అసలు జరిగింది వేరే..
అన్మోల్ సింఘాల్ అనే యువకుడు న్యూ మండీ ప్రాంతంలో హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు పోలీసులు ఆపారు. తన వద్ద వాహనానికి సంబంధించిన అవసరమైన పత్రాలు కూడా లేకపోవడంతో, పోలీసులు చలాన్ జారీ చేశారు. తీరా ఆ ఫైన్ మొత్తాన్ని చూసి, అన్మోల్ కళ్లు తిరిగాయి. చలానాలో ఆ జరిమానా మొత్తం రూ.20,74,000గా ఉంది..
ఆ మొత్తాన్ని చూసి షాక్ అయిన రైడర్ ఆ చలాన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ప్రజల విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు తక్షణమే దానిని సరిచేసి, నిజమైన జరిమానా మొత్తం రూ.4,000 మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయమై ట్రాఫిక్ సూపరింటెండెంట్ అతుల్ చౌబే మాట్లాడుతూ, ఇది సబ్ ఇన్‌స్పెక్టర్ వల్ల జరిగిన సాంకేతిక తప్పిదం. సెక్షన్ 207 కింద చర్య తీసుకున్నారు కానీ ఆయన ‘MV Act’ అని రాయకపోవడంతో 207 మరియు 4000 కలసి 20,74,000గా ప్రింట్ అయ్యింది,” అని చెప్పారు.
మోటార్ వెహికల్స్ యాక్ట్ 207 సెక్షన్ ప్రకారం, అవసరమైన పత్రాలు లేని వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు. జరిమానా కూడా విధించవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram