Nirmal: గొర్రెల మందపై కుక్కల దాడి.. 20 గొర్రెలు మృతి
రూ.2.50 లక్షల నష్టం విధాత: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అంబర్ పేట్ గ్రామంలో కొండవెని కొమురయ్యకు చెందిన గొర్ల కొట్టంలో తన గొర్రెల మందపై తెల్లవారుజామున వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కల దాడితో దాదాపు రెండు లక్షల 50 వేల రూపాయల విలువగల 20 గొర్రెలు మృతి చెందాయి. 5 గొర్రెలకు పైగా తీవ్ర గాయాల పాలై ప్రాణపాయస్థితిలో ఉన్నాయి. గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం […]

- రూ.2.50 లక్షల నష్టం
విధాత: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అంబర్ పేట్ గ్రామంలో కొండవెని కొమురయ్యకు చెందిన గొర్ల కొట్టంలో తన గొర్రెల మందపై తెల్లవారుజామున వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి.
కుక్కల దాడితో దాదాపు రెండు లక్షల 50 వేల రూపాయల విలువగల 20 గొర్రెలు మృతి చెందాయి. 5 గొర్రెలకు పైగా తీవ్ర గాయాల పాలై ప్రాణపాయస్థితిలో ఉన్నాయి.
గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ లక్ష్మి లచ్చన్న, స్థానిక నాయకులు కోరారు.