నేడు సూర్యగ్రహణం.. ఈ పనులు అసలు చేయకూడదు..
Solar Eclipse | ఈ నెల 25న అంటే దీపావళి రోజున పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. భారత్‌లో 25వ తేదీన సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై.. 5.43 గంటలకు ముగుస్తుంది. అంటే ఒక గంట 14 నిమిషాల 15 సెకన్ల పాటు పాక్షిక సూర్యగ్రహణం కొనసాగనుంది. భారత్‌లో పలు ప్రదేశాల్లో ఈ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. అయితే గ్రహణం చూసేటప్పుడు గాగూల్స్ ఉపయోగిస్తే మంచిది. అంతేకాకుండా ఆ సమయంలో కొన్ని పనులు చేయక పోవడమే మంచిదని జ్యోతిష్య […]
Solar Eclipse | ఈ నెల 25న అంటే దీపావళి రోజున పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. భారత్‌లో 25వ తేదీన సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై.. 5.43 గంటలకు ముగుస్తుంది. అంటే ఒక గంట 14 నిమిషాల 15 సెకన్ల పాటు పాక్షిక సూర్యగ్రహణం కొనసాగనుంది.
భారత్‌లో పలు ప్రదేశాల్లో ఈ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. అయితే గ్రహణం చూసేటప్పుడు గాగూల్స్ ఉపయోగిస్తే మంచిది. అంతేకాకుండా ఆ సమయంలో కొన్ని పనులు చేయక పోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పనులు అసలు చేయకూడదు..
- సూర్య గ్రహణం రోజున ఎలాంటి శుభకార్యాలు నిర్వహించొద్దు. పూజలు కూడా చేయొద్దు.
- గ్రహణం కొనసాగుతున్న సమయంలో అసలు నిద్రించొద్దు.
- ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఇండ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిది.
- గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు.
- ఒక వేళ గ్రహణానికి ముందే వండిన వంటలు ఉంటే.. దాంట్లో తులసి ఆకులు వేయండి.
- గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని, ఇతర సముదాయాలను శుభ్రం చేసుకోవాలి.
- గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి, పూజలు చేసుకోవాలి.
- సూర్య భగవాణున్ని పూజించి, ఆయన మంత్రాన్ని పఠించండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram