నాకోసం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపొద్దు

నాకోసం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపొద్దు

ప్రతి నెలా లబ్ధిదారుల గ్రామాలకు వెళ్లి పంపిణీ చేయండి

♦ మీ పనుల కోసం ఎవ్వరికీ ఒక పైసా ఇవ్వొద్దు

 ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి.. పరిష్కరిస్తా

 మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

 మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు వెంటనే పంపిణీ చేయాలని, తన కోసం ఆపొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి నెలా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల గ్రామాలకు వెళ్లి పంపిణీ చేయాలని సూచించారు. మంగళవారం మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మునుగోడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని, ప్రజల వద్దకే ప్రజాపాలన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలకు సంబంధించి దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు.


ఏ పని ఉన్నా ఇక్కడ నా క్యాంప్ ఆఫీస్ కి వస్తే పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. బెల్ట్ షాపులు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని, దానికోసం ప్రజలంతా తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మునుగోడు మండల తహసీల్దార్ నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.