Crime News | నేను శివుడిని.. మ‌ళ్లీ బ‌తికిస్తానంటూ మ‌హిళ‌ను గొడుగుతో చంపేశాడు..

Crime News | ఓ వ్య‌క్తి.. తాను సాక్షాత్తూ ఆ శివుడిని అని.. చ‌నిపోయిన వారిని మ‌ళ్లీ బ‌తికించే శ‌క్తి త‌న‌కు ఉంద‌న్నాడు. దీంతో ఓ మ‌హిళ‌ను గొడుగుతో చంపేశాడు. కానీ ఆ త‌ర్వాత బ‌తికించ‌లేక‌పోయాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ జిల్లా గోగుండా త‌హ‌సీల్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివ‌సించే ప్ర‌తాప్‌సింగ్(70) పీక‌ల దాకా మ‌ద్యం సేవించాడు. మ‌ద్యం మ‌త్తులో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ.. తాను శివుడి అవ‌తార‌మ‌ని ఊగిపోయాడు. అత‌నికి ఎదురుగా […]

Crime News | నేను శివుడిని.. మ‌ళ్లీ బ‌తికిస్తానంటూ మ‌హిళ‌ను గొడుగుతో చంపేశాడు..

Crime News | ఓ వ్య‌క్తి.. తాను సాక్షాత్తూ ఆ శివుడిని అని.. చ‌నిపోయిన వారిని మ‌ళ్లీ బ‌తికించే శ‌క్తి త‌న‌కు ఉంద‌న్నాడు. దీంతో ఓ మ‌హిళ‌ను గొడుగుతో చంపేశాడు. కానీ ఆ త‌ర్వాత బ‌తికించ‌లేక‌పోయాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ జిల్లా గోగుండా త‌హ‌సీల్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివ‌సించే ప్ర‌తాప్‌సింగ్(70) పీక‌ల దాకా మ‌ద్యం సేవించాడు. మ‌ద్యం మ‌త్తులో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ.. తాను శివుడి అవ‌తార‌మ‌ని ఊగిపోయాడు. అత‌నికి ఎదురుగా క‌నిపించిన క‌ల్కిబాయ్ గ‌మేతి(85) అనే వృద్ధురాలిని అడ్డ‌గించాడు.

నువ్వు మ‌హారాణివి.. నిన్ను చంపి మ‌ళ్లీ బ‌తికిస్తా అని చెప్పాడు. ఆమె ఛాతీపై బ‌లంగా కొట్టాడు. ఆ త‌ర్వాత త‌న వద్ద ఉన్న గొడుగుతో దాడి చేశాడు. దీంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన వృద్ధురాలు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయింది.

ఈ దారుణాన్ని అక్క‌డే ఉన్న ఇద్ద‌రు మైన‌ర్లు, నాథూసింగ్ అనే మ‌రో వ్య‌క్తి కలిసి త‌మ ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. అనంత‌రం ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు స్పందించారు. వృద్ధుడు ప్ర‌తాప్ సింగ్‌తో పాటు నాథూసింగ్, ఇద్ద‌రు మైన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని మృతురాలి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.