Eatala Rajender | ప్రభుత్వానికి ఇక్కడి రైతుల కన్నీరు పట్టదా? ఇంకా 80 శాతం ధాన్యం కల్లాలలోనే..

Eatala Rajender దళిత బంధు కమిషన్ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలి విచ్చలవిడి ఇసుక రవాణాతో ఎడారులుగా మారుతున్న నియోజకవర్గాలు హుజురాబాద్ సిఐ, వీణవంక ఎస్సై పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ రైతు కళ్ళల్లో కన్నీరు తప్ప, ఆనందం లేదు.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతులకు డబ్బు ఇచ్చి వస్తున్న ప్రభుత్వానికి ఇక్కడి రైతుల కన్నీరు పట్టడం లేదని హుజురాబాద్ […]

  • Publish Date - April 29, 2023 / 05:03 AM IST

Eatala Rajender

  • దళిత బంధు కమిషన్ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలి
  • విచ్చలవిడి ఇసుక రవాణాతో ఎడారులుగా మారుతున్న నియోజకవర్గాలు
  • హుజురాబాద్ సిఐ, వీణవంక ఎస్సై పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
  • విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ రైతు కళ్ళల్లో కన్నీరు తప్ప, ఆనందం లేదు.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతులకు డబ్బు ఇచ్చి వస్తున్న ప్రభుత్వానికి ఇక్కడి రైతుల కన్నీరు పట్టడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Eatala Rajender) ఆరోపించారు.

శనివారం హుజూరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను పరామర్శించే ఓపిక, తీరిక శాసనసభ్యులు, మంత్రులకు లేకుండా పోయిందన్నారు. వారికి పార్టీ కార్యక్రమాల సంబరాలు, దావతులు తప్ప మరొకటి పట్టడం లేదని ధ్వ‌జ‌మెత్తారు.

ప్రభుత్వ అసమర్ధ, అనాలోచిత నిర్ణయాల వల్ల 2020 రూపాయలకు క్వింటాల్ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన రైతులు, 1300 రూపాయలకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 20% ధాన్యమే మిల్లులకు చేరుకోగా, మరో 80% ధాన్యం కల్లాలలోనే ఉండిపోయింద న్నారు.

‘కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం మీద 600 గ్రాముల కంటే ఎక్కువగా తరుగు తీయడం లేదని శాసనసభ సాక్షిగా మంత్రి చెప్పారని… ‘ నేను ఓ రైతునే కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పీకర్ దాన్ని సమర్థించారనిస‌ గుర్తుచేసిన ఈటల క్షేత్రస్థాయిలో అలాగే జరుగుతుందా అని ప్రశ్నించారు.

కొనుగోలు కేంద్రాల కోసం ప్రభుత్వం ముందస్తు ఏర్పాటు చేయలేదని, ఇదేమని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై చిన్న చూపు, రైతు సంఘాలపై లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తోందని, అన్ని తమకే తెలుసు అన్న పాలకుల అహంకార ధోరణికి ఇది నిదర్శనం అన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నుండి స్పందన లేదని, ఆయన నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అధికారుల మధ్య సమన్వయం లేదు, మరోవైపు ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ నిష్క్రియ ప్రియత్వం బయటపడింది అని అన్నారు.

బొందల గడ్డలా మారుస్తున్నారు..

అధికార పార్టీ నాయకులు, పోలీసుల అండతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. పోలీసులు ఇసుక కాంట్రాక్టర్ల ముందు మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. ట్రాక్టర్ల వద్ద మామూళ్ళు వసూలు చేయడం వారికి నిత్య కృత్యంగా మారిందన్నారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా హుజురాబాద్, పెద్దపల్లి మానకొండూరు నియోజకవర్గాలు ఎడారిగా మారిపోతున్నాయని దీనిపై ముఖ్యమంత్రి స్పందించాల్సి ఉందన్నారు.

పేర్లు బయట పెట్టాలి..

దళిత బంధు అమలుకు సంబంధించి లబ్ధిదారుల నుండి డబ్బు వసూలు చేస్తున్న శాసనసభ్యుల పేర్లు బయటపెట్టాలని ఈటెల డిమాండ్ చేశారు. దళిత బంధు అమలుకు శాసనసభ్యులు డబ్బు వసూలు చేస్తున్న విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారని పత్రికలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రికి దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే అక్రమాలకు పాల్పడిన వారి పేర్లు బయటపెట్టాలని, వారిని బర్తరఫ్ చేయాలని కోరారు. ప్రగతి భవన్ ఖాళీ చేసి, దళిత బస్తీలలోకి వస్తే వారి బతుకు ఏంటో తెలుస్తుందని మండిపడ్డారు.

పోలీస్ రాజ్యం

బీఆర్ఎస్ తెలంగాణను పోలీసు రాజ్యాంగా మార్చి వేసిందని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టు,
తీసుకువచ్చి కొట్టు అన్న విధానం నడుస్తుందన్నారు. కొంతమంది పోలీసులు చట్టాన్ని పక్కనపెట్టి అధికార పార్టీ నేతలకు జీతగాళ్ల మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. 10 నుండి 20 లక్షల రూపాయలు లంచం ఇచ్చి అనుకూలమైన చోట పోస్టింగులు వేయించుకొని, ఆ మొత్తాన్ని రికవరీ చేసుకోవడం కోసం వారు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు.

వీణవంక పోలీస్ స్టేషన్లో దోపిడీ జరుగుతోందని, పేదలను కొట్టి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు వీటన్నింటిని మౌనంగా చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.

పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసు, పోలీసు కమిషనరేట్ కార్యాలయాలలో అంత తమదే నడుస్తుందని కొందరు ప్రగల్బాలు పలుకుతున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హుజురాబాద్ సిఐ, వీణవంక ఎస్ఐ మీద మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాస్తానని హెచ్చరించారు.