తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
విధాత, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు అందుకున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ రావాల్సిందిగా పిలుపిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్అలీ, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, సుదర్శన్‌రెడ్డి, రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు […]
విధాత, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు అందుకున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ రావాల్సిందిగా పిలుపిచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్అలీ, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, సుదర్శన్‌రెడ్డి, రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం ఏఐసీసీ ఆడిటర్లతో భేటీ కానున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించారు. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు.
ఇదే కేసులో ఈ ఏడాది జూన్, జూలైలలో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు సుమారు 50 గంటలకు పైగా ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ కంపెనీ కూడా ఏజేఎల్ యొక్క ఆస్తులలో రూ. 800 కోట్లకు పైగా తీసుకుందని ఈడీ పేర్కొంది. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణను ప్రారంభించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram